Madanapalli Girl Murder: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన సైకో కులవర్దన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కురబలకోట మండలంలోని కనసానివారి పల్లి చెరువులో మృతదేహం లభ్యం అయింది. ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి ముదివేడు పోలీసులు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కులవర్దన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: రూ.7,499కే IP64 రేటింగ్, Unisoc ప్రాసెసర్‌తో Lava Bold N2 లాంచ్.. ఫీచర్స్ ఇలా!
అయితే, మదనపల్లెలో సైకో కులవర్దన్ చేతిలో హత్యకు గురైన చిన్నారికి నేడు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దిండిమీదాగారి పల్లె గ్రామంలో చిన్నారి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక, ఈ కేసులో నిందితుడు కులవర్థన్ కోసం పోలీసులు నిన్నటి నుంచి ప్రత్యేక బృందాలతో గాలించారు. కానీ, ఈరోజు ఉదయం అతడి మృతదేహం కనసానివారి పల్లి చెరువులో కనిపించడంతో సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.