NTV Telugu Site icon

Annamaya District: గుప్త నిధుల కోసమా..? మరేదైనా కారణమా.. అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత

Annamaya District

Annamaya District

అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం కదిరినాథుని కోట పంచాయతీ మొలకలచెరువు సమీపంలో 16వ శతాబ్దంలో కనుగొండ రాయస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి ఎదురుగా బండపై అభయాంజనేయ స్వామి శిల్పాన్ని చెక్కి ఆలయాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఈ ఆలయం వద్ద బండపై చెక్కిన అభయాంజనేయ స్వామి కళ్ళకు గంతలు కట్టిన దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. 12 నెలల క్రితం బండపై చెక్కిన అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

Read Also: IND vs NZ: తొలి టెస్టు మొదటిరోజు ఆట రద్దు..

అయితే.. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రిగ్గులు నాట్లతో ఆలయాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు. వర్షం కారణంగా రిగ్గులో నాట్లు పేలక పోవడంతో రిగ్గులకు ఏర్పాటు చేసిన వైర్లు కాలిపోయాయి. గుర్తులు ఆలయ గోడపై కనిపిస్తున్నాయి. ఎలాగైనా ఆలయాన్ని కూల్చేయాలని ఉద్దేశంతో సుత్తి, గడ్డపార ఇతర పరికరాలతో గోడను కింది భాగం తొలగించారు. దీంతో ఆలయం ఒక వైపు వెళ్ళిపోయింది. ఆలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వదిలేశారు. కొండ ప్రాంతంలో ఆలయం ఉండటంతో ఉదయం వరకు విషయం ఎవరికీ తెలియలేదు.

Read Also: Jaishankar Pakistan Visit :పాకిస్థాన్‌లో టెన్షన్ టెన్షన్.. జైశంకర్ ప్రసంగానికి పాక్ భయాందోళన?

సమాచారం అందుకున్న మొలకలచెరువు ఎస్సై గాయత్రి ఈరోజు సంఘటన స్థలాన్ని పరిశీలించగా.. పూర్తిగా ఆలయం ధ్వంసము అయ్యి విగ్రహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ విషయంపై హిందూ ధర్మిక సంస్థలు, బీజేపీ నేతలు, కూటమి నేతలు ఆలయాన్ని కూల్చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసిన మొలకలచెరువు పోలీసులు ఆలయ కూల్చివేత కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. విచారణ వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.‌‌