Andhra Pradesh: గంజాయి సరఫరాలో నంబర్ వన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Stood At First Place in Marijuana Case: గంజాయి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఏపీలోనే అత్యధికంగా 26% గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారని, ఆ రాష్ట్రంలో దొరికినంత గంజాయి మరే ఇతర రాష్ట్రాల్లో దొరకలేదని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నివేదిక (2021) వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. 2021లో దేశవ్యాప్తంగా 7,49,761 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, ఒక్క ఏపీలోనే 2,00,588 (26.75%) కిలోల గంజాయిని గుర్తించారు. ఇక ఏపీ తర్వాత రెండో స్థానంలో ఒడిశా (1,71,713) నిలిచింది. దేశంలో లభ్యమైన గంజాయిలో.. మొత్తం 50% ఈ రెండు రాష్ట్రాల్లోనే లభించిందంటే, ఏ స్థాయిలో అక్కడ గంజాయి సరఫరా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో హషీష్ 18.14 కిలోలు, హషీష్ ఆయిల్ 6.13 లీటర్లు, 3 ఎల్ఎస్డీ బ్లాట్స్ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1775 కేసులు నమోదు కాగా.. 4202 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక తెలంగాణ విషయానికొస్తే.. 35,270 కిలోల గంజాయి పట్టుకున్నట్టు ఆ నివేదికలో వెల్లడైంది. అలాగే 0.03 కిలోల హషీష్, 18.5 లీటర్ల హషీష్ ఆయిల్, 0.03 కిలోల హెరాయిన్, 0.01 కిలోల కెటామైన్, 31 ఎల్ఎస్డీ బ్లాట్స్ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ కేసుల్లో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా మొత్తం 7618 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోగా.. అందులో ఒక్క గుజరాత్‌లోనే 3334 కిలోల హెరాయిన్ లభించింది. ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా.. అక్కడ 1337 కిలోల హెరాయిన్‌ని పట్టుకున్నారు. ఇక డ్రగ్స్ అత్యధిక ప్రభావం ఉన్న పంజాబ్‌లో 443.51 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్టు ఎన్సీబీ నివేదిక వెల్లడించింది.
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్‌పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!