బాధితులు ఎవరూలేని ఘటనలో కూడా టీడీపీ ఆరోపణలు చేస్తోంది అంటూ ఫైర్ అయ్యారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బాధితులు ఎవరూ లేని ఘటనలో టీడీపీ ఆరోపిస్తుంది… గతంలో ఇలాంటి ఆరోపణలు వస్తే సీఎం జగన్ ఉపేక్షించలేదని గుర్తుచేశారు. గడిచిన వారం రోజులుగా ఇదే అంశాన్ని పట్టుకొని వేలాడుతున్నారని మండిపడ్డ ఆయన.. సమస్యల పై స్పందించకుండా ఇలాంటి దిగజారుడు పనులు చేస్తున్నారని విమర్శించారు. దిశా లాంటి చట్టాలను చేసి మహిళలకు రక్షణ కల్పిస్తుంటే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు.. రాష్ట్రంలో చెప్పడానికి ఎలాంటి అంశాలు లేకపోవడం వలన ఇలాంటి అనవసర యాగీ చేస్తున్నారన్నారు. కానీ, సమాజంలో సిగ్గుమాలిన పని ఎవరు చేసినా అది ఉపేక్షించేది కాదని స్పష్టం చేశారు ధర్మాన.
Read Also: Nallapareddy Prasanna kumar Reddy: నేను పార్టీ మారుతున్నానని దుష్ప్రచారం.. ఎవరూ నమ్మొద్దు..
గత కొద్దిరోజులుగా వైస్సార్సీపీ మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ధర్మాన.. అనంతపురం జిల్లా ప్రజా ప్రతినిధి అంశాన్ని మొత్తం వైస్సార్సీపీకి అంటగడుతున్నారన్న ఆయన.. వైస్సార్సీపీ మహిళలకు కీడు చేస్తుందని టీడీపీ ప్రచారం చేస్తుంది.. కుయోక్తులతో ఎదుటి పార్టీని పడగొట్టడం చంద్రబాబు నైజం అని మండిపడ్డారు. సీఎం జగన్ తన కేబినెట్‌లో ఎన్నడూ లేనంతమంది మహిళలను మంత్రులుగా చేశారని ప్రశంసలు కురిపించారు.. మహిళల రుణాలు తీర్చుతానని చెప్పి అధికారంలోకి వచ్చి చంద్రబాబు మోసం చేశారని ఫైర్ అయిన ఆయన.. చంద్రబాబు మహిళా రుణగ్రస్తులను మోసం చేస్తే సీఎం జగన్ వచ్చి వాళ్లకి రుణ విముక్తులను చేశారని పేర్కొన్నారు. మహిళలకు నాయకత్వం ఇచ్చి జగన్ గౌరవిస్తున్నారని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.