జల జగడం.. కృష్ణజలాలపై సుప్రీంకు ఏపీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ ముదురుతోంది.. ఓ వైపు మాటల యుద్ధం.. మరోవైపు ప్రధానికి, కేంద్ర మంత్రులకు, కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖలు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదుల వరకు వెళ్లింది.. ఇప్పుడు కృష్ణజలాల వివాదంపై సుప్రీంకోర్టుకువెళ్లే యోచనలో ఉంది ఏపీ సర్కార్… సుప్రీంలో పిటిషన్ దాఖలుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. అంతర్రాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులను, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని, నిర్వహణ, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని, తక్షణమే తెలంగాణ జీవోను సస్పెండ్ చేయాలని, కేఆర్ఎంబీ విధివిధానాల ఖరారుకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని.. పిటిషన్లో పొందుపరుస్తున్నట్టు సమాచారం.
రైతుల, ప్రజల హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తోందని.. సముద్రంలోకి విలువైన జలాలను కలిసేలా పరిస్థితులు సృష్టించి మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని.. తక్షణం అడ్డుకోవాలంటూ ఈ వాదనలను పిటిషన్లో ప్రస్తావించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుండగా.. ఇక, విచారణ సందర్భంగా ప్రస్తావించనున్న అంశాలపై సాగునీటి శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం… దేశంలో రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలు సర్వసాధారణమై పోయాయి. అంతర్రాష్ట్ర నదులపై ఉన్న రిజర్వాయర్లను జాతీయ ఆస్తులుగా గుర్తించి, నిర్వహణ, భద్రతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని ఈసందర్భంగా విజ్ఞప్తిచేసే అవకాశం ఉందంటున్నారు.. రిజర్వాయర్లతోపాటు వాటిపై ఉన్న విద్యుత్ కేంద్రాలన్నింటినీకూడా జాతీయ ఆస్తులుగా గుర్తించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఏపీ కోరనుందనని సమాచారం. వివిధ నదుల్లో నీటివాటాలపై వివిధ ట్రైబ్యునల్స్, కోర్టులు తమ తీర్పుల ద్వారా ఇప్పటికే ఖరారు చేశాయి.. వాటిని కచ్చితంగా అమలు చేయడానికి ఇది అవసరమంటున్న అధికారులు. నిర్దేశించిన వాటాలను మీరి నీటిని అక్రమంగా వాడుకోవడం, ఆ ఒప్పందాలను ఉల్లంఘించేలా కొత్త ప్రాజెక్టులు కట్టడం, లేదా ఉన్న ప్రాజెక్టులను విస్తరించడం తదితర అక్రమ చర్యలను ఆపాలంటే ఒక శాశ్వాత పరిష్కారం అవసరమని కోర్టుకు నివేదించనున్నట్టుగా సాగునీటి అధాకార వర్గాల సమాచారం. నదీజలాల వివాదం ఎవరు పరిష్కరించాలన్న విషయాన్ని రాజ్యాంగంలోనే పొందుపరిచారని, రాజ్యాంగం ప్రకారం కేంద్రమే వీటిని పరిష్కరించాలని చెప్పారు కాబట్టి, అంతర్రాష్ట్ర నదీజలాలపై ఉన్న రిజర్వాయర్లు, విద్యుత్ కేంద్రాలన్నీకూడా కేంద్రం పరిధిలోనే ఉండాలంటూ పిటిషన్ద్వారా ఏపీ కోరనున్నట్టు తెలుస్తోంది.
Also Read
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!