Andhra Pradesh: సెలవుల క్యాలెండర్ విడుదల.. ఉగాది, వినాయకచవితికి వాళ్లకు నో హాలీడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: 2023 ఏడాదికి గానూ సెలవుల క్యాలెండర్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రభుత్వ కార్యాలయాలకు 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. సాధారణ సెలవుల్లో మూడు ఆదివారాలు, ఒకటి రెండో శనివారం.. ఐచ్ఛిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. మకర సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారాల్లో.. సాధారణ సెలవుల్లో వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారుల అనుమతితో ఐదు ఐచ్ఛిక సెలవులను పొందేందుకు వీలు కల్పించింది. రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ వంటి పండుగలతోపాటు తిథులను బట్టి వచ్చే హిందూ పండుగల్లో మార్పులు ఉంటాయని, వాటిని ముందుగానే పత్రికా ప్రకటన, మీడియా ద్వారా తెలియజేస్తామని ప్రభుత్వం తెలిపింది.
Read Also: Puri Jagannadh : ఆ ఆలయంలో సెల్ ఫోన్లు నిషేదం.. జనవరి నుంచే అమలు
Also Read
అయితే ఉగాది, శ్రీరామ నవమి, వినాయక చవితి పండుగల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. దీంతో బ్యాంకర్లు షాకవుతున్నారు. ఈ అంశంపై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యమైన హిందూ పండుగలకు సెలవులు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం మూడేళ్లుగా ఇలాగే వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే ఈ మూడు పండుగలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!