AP Government Notice: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సర్కార్ నోటీసులు.. వారం రోజుల డెడ్‌లైన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government Notice: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. అసలు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలని నోటీసులు ఇచ్చింది జీఏడీ.. దీనికి కోసం వారం రోజులు గడువు పెట్టింది.. వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయటం రోసా నిబంధనలకు విరుద్ధమని నోటీసులో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసు జారీ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.. వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలున్నా… గవర్నర్‌ను ఎందుకు సంప్రదించాల్సి వచ్చిందని ఆ నోటీసుల్లో అడిగింది ప్రభుత్వం..
Read Also: Jiyaguda Case Twist: జియాగూడా కేసులో ట్వీస్ట్.. సాయినాధుని చంపింది స్నేహితులే
Also Read
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
కాగా, ఉద్యోగుల వేతనాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన అంశం ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దయ్యే పరిస్థితులకు దారి తీసింది.. సర్వీసు నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ఏపీఎన్జీవో సంఘం ఈ వ్యవహారంపై సీఎస్ కు ఫిర్యాదు చేయటంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. ఉద్యోగులకు వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాజ్ భవన్ మెట్లెక్కితే.. ఏపీ ఎన్జీవోల సంఘం ఈ వ్యవహారం సరైంది కాదని తప్పుబట్టింది.. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోసం పోరాడేందుకు ప్రయత్నం చేస్తున్న సంఘం గుర్తింపు రద్దు కోసం ఫిర్యాదు చేయటం ఏమిటని ఉద్యోగులు మండిపడుతున్నారు.. ఉద్యోగ సంఘం.. గవర్నర్ కు ఫిర్యాదు చేయటంపై గుర్రుగా ఉన్న ప్రభుత్వంలోని పెద్దలే మరో ఉద్యోగ సంఘంతో సర్వీసు నిబంధనల ఉల్లంఘనల పేరిట ఫిర్యాదు చేసేలా ప్రోత్రహించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.. ఇక, ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం.. వారం రోజుల గడువు ఇవ్వడంతో.. ఉద్యోగుల సంఘం ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు.. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వం సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించటం లేదని మీడియాలో వచ్చిన కథనాల స్పందించిన ప్రభుత్వం.. తప్పుడు కథనాలు రాసిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సంక్షేమం, కొత్త నియామకాలు, ఇతర అన్ని అంశాలతో 8 పేజీల లేఖ విడుదల చేసింది ప్రభుత్వం. మెజారిటీ ఉద్యోగులకు నెల తొలినాళ్లలోనే జీతాలు పడుతున్నా… బిల్లుల సమర్పణలో జాప్యం, ఇతరత్రా కారణాల వల్ల కొద్ది మందికి మాత్రం 20వ తేదీ వరకు సమయం పడుతోంది. ఈ వాస్తవాలకు మసిపూసి… ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎస్ఎస్ రావత్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఏకంగా 5 డీఏలు బకాయిలు పెట్టినా పట్టించుకోని వార్తపత్రికలు ప్రచురిస్తున్న కథనాలను ఎస్ఎస్ రావత్ తీవ్రంగా తప్పు పట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొన్ని పత్రికలు పనికట్టుకొని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని, వాటిపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!