క్వారీ అక్రమాలపై ఏపీ సర్కార్ ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైనింగ్ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సహజ వనరుల దోపిడీపై ఫిర్యాదు రావడంతో… విశాఖలో క్వారీలపై తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రోన్లు, జీపీఎస్ ఆధారిత సర్వే ద్వారా అక్రమాల గుర్తించి.. ఇష్టారాజ్యంగా జరుగుతున్న గనుల తవ్వకాలకు చెక్ పెట్టనున్నారు. అనకాపల్లిలోని ఓ మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై విచారణ జరపనుంది సీఐడీ. గనులశాఖ విజిలెన్స్ కూడా ఇప్పటికే భారీగా జరిమానాలు విధించింది. విశాఖలోని వందల క్వారీలు.. కనీస నిబంధనలు కూడా పాటించడం లేదని నిర్ధారించారు. విజిలెన్స్, మైన్స్, సర్వే శాఖ, కాలుష్య నియంత్రణ మండలి టీమ్‌లతో సోదాలు చేయనున్నారు. ఏజెన్సీతో పాటు అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విస్తృతంగా తనిఖీలు చేపట్టబోతున్నారు.వివాదాస్పదంగా మారిన లేటరైట్, గ్రానైట్ గనుల అక్రమాల లెక్కలు… అణాపైసలతో సహా బయట పెడతామంటున్నారు అధికారులు. మంగళవారం నుంచి ఈ తనిఖీలు ప్రారంభంకానున్నాయి.
లేటరైట్ తవ్వకాలకు మాత్రమే ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు మంత్రి పెద్దిరెడ్డి. లేటరైట్‌కు బాక్సైట్‌కు మధ్య టీడీపీకి తెలియదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయాలని చూడడం తగదన్నారు. అనకాపల్లిలో అక్రమ మైనింగ్ చేసినట్టు గనులశాఖ నిర్ధారించి, జరిమానా విధించిన నాలుగు భారీ క్వారీల్లో సిఐడీ విచారణ చేపట్టింది. ఇక్కడ జరిగిన తవ్వకాలు అక్రమమని నిర్ధారిస్తే.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.
Also Read
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
తాజావార్తలు
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్‌లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
-
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
ట్రెండింగ్
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!