మైనింగ్ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సహజ వనరుల దోపిడీపై ఫిర్యాదు రావడంతో… విశాఖలో క్వారీలపై తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రోన్లు, జీపీఎస్ ఆధారిత సర్వే ద్వారా అక్రమాల గుర్తించి.. ఇష్టారాజ్యంగా జరుగుతున్న గనుల తవ్వకాలకు చెక్ పెట్టనున్నారు. అనకాపల్లిలోని ఓ మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై విచారణ జరపనుంది సీఐడీ. గనులశాఖ విజిలెన్స్ కూడా ఇప్పటికే భారీగా జరిమానాలు విధించింది. విశాఖలోని వందల క్వారీలు.. కనీస నిబంధనలు కూడా పాటించడం లేదని నిర్ధారించారు.…