Mandous Cyclone Effect: మాండూస్ తుఫాన్‌పై సీఎస్ సమీక్ష.. ఆ జిల్లాల్లో తీవ్ర ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీరం దాటిన మాండూస్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.. ఇక, తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలపై విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం, ఆదివారం రెండు రోజులు గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. వర్షపు నీరు తొలగిన తర్వాత నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.. తిరుపతి పట్టణంలో వర్షపు నీరు త్వరిత గతిన దిగువకు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి కలెక్టర్‌ను ఆదేశించారు సీఎస్ జవహర్‌రెడ్డి.
Read Also: Big Twist in Vaishali Case: వైశాలి కేసులో బిగ్ ట్విస్ట్.. మాకు ఏడాది క్రితమే పెళ్లైందంటున్న నవీన్
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.పూనం మాలకొండయ్య మాట్లాడుతూ భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో వెంటనే శానిటేషన్ పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. వర్షపు నీరు తగ్గిన వెంటనే పంట నష్టం అంచనాలు చేపట్టాలని సూచించారు.. ఇక, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సంచాలకులు డా.బీఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 8.30 గంటల నుండి శనివారం ఉ.8.30 గంటల వరకు అన్నమయ్య జిల్లాలో 23.3 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో 30.5,ప్రకాశం జిల్లాలో 14.1, నెల్లూరు జిల్లాలో 57.6, తిరుపతి జిల్లాలో 75.7, వైయస్సార్ కడప జిల్లాలో 14.5 మిల్లీమీటర్ల వంతున సరాసరి వర్షపాతం నమోదైందని సీఎక్కు వివరించారు. కాగా, గత 24 గంటల్లో పై తెలిపిన ఆరు జిల్లాల్లోని 109 ప్రాంతాల్లో 64.5 మిల్లీ మీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపారు.. టెలీకాన్ఫరెన్స్ లో పొల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు జిల్లాలో 2 గేదెలు, 2 గొర్రెలు చనిపోగా రెండు తాటాకు ఇళ్ళు దెబ్బతిన్నాయని వివరించారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఒక గృహం దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఇంకా ఈటెలీ కాన్ఫరెన్స్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!