NTV Telugu Site icon

AP Tourism: పర్యాటక రంగంపై సీఎం జగన్ ఫోకస్.. వారికి గుడ్‌న్యూస్‌..

Ys Jagan

Ys Jagan

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పర్యాటక రంగంపై ఫోకస్‌ పెట్టారు.. అందులో భాగంగా.. పర్యాటక శాఖపై ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరుగనున్న సమావేశానికి.. ఆ శాఖ మంత్రి ఆర్కే రోజా, ఆ శాఖకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.. ఇక, అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త కూడా చెప్పబోతున్నారు.. ఎందుకంటే.. విజయవాడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు ప్రారంభంకానున్నాయి.. కరోనా మహమ్మారి పస్ట్‌వేవ్‌ తర్వాత నుంచి ఇప్పటివరకు వందేభారత్‌ మిషన్‌లో భాగంగానే ఇక్కడికి సర్వీస్‌లు నడుపుతూ వచ్చారు అధికారులు.. అయితే, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ (యూఏఈ)లోని షార్జా–విజయవాడ మధ్య వారానికి రెండు డైరెక్ట్‌ విమాన సర్వీస్‌లు నడిపేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ముందుకొచ్చింది. షెడ్యూల్‌ను ప్రకటించడంతోపాటు టికెట్ల బుకింగ్‌ను కూడా ప్రారంభించారు.

Read Also: Twin Towers Demolition: 9 సెకన్లలో ముగిసిన తొమ్మిదేళ్ల సుదీర్ఘ యుద్ధం.. కూల్చేశారు కానీ..

వారు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. అక్టోబర్‌ 31వ తేదీ నుంచి ప్రతి సోమ, శనివారాల్లో షార్జా–విజయవాడ మధ్య విమాన సర్వీసులు నడపనున్నారు.. 186 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన బోయింగ్‌ 737–800 విమానం… షార్జాలో మధ్యాహ్నం 1.40 గంటలకు బయల్దేరి సాయంత్రం 5.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనుంది.. ఇక, తిరిగి సాయంత్రం 6.35 గంటలకు గన్నవరం నుంచి బయల్దేరే ఆ విమానం.. రాత్రి 10.35 గంటలకు షార్జా చేరుకోనుంది.. ఈ విమాన ప్రయాణానికి ప్రారంభ టికెట్‌ ధరను రూ.15,069గా నిర్ణయించారు. ఈ సర్వీస్‌ ప్రారంభమైతే ఇక్కడి నుంచి అరబ్‌ దేశాలకు ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, 2017 మే నెలలోనే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు అంతర్జాతీయ హోదా కల్పించింది కేంద్ర సర్కార్.. ఇక, 2019లో 6 నెలల పాటు విజయవాడ–సింగపూర్‌ మధ్య వారానికి ఒక సర్వీస్‌ నడిపారు.. కానీ, సాంకేతిక కారణాలతో అది కూడా రద్దు చేశారు.. ఆ తర్వాత దుబాయ్, సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు నడిపేందుకు ప్రయత్నాలు జరిగానా కోవిడ్‌ ఎఫెక్ట్‌తో అదికూడా సాధ్యపడలేదు.. కేవలం వందేభారత్‌ మిషన్‌లో భాగంగా కొన్ని సర్వీసులను మాత్రమే నడిపారు.. ఇటీవల అంతర్జాతీయ విమాన సర్వీస్‌లపై కేంద్రం నిషేధం ఎత్తేయడంతో ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో విదేశాలకు సర్వీస్‌లు నడిపేందుకు తిరిగి సన్నహాలు ప్రారంభమయ్యాయి.