Education: విద్యాశాఖపై సీఎం కీలక సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యావిధానంలో మార్పుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగుతున్నాయి.. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లీష్ మీడియంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష నిర్వహించారు.. విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు.. వాటి అమలు తీరును సీఎంకు వివరించిన అధికారులు. నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఇప్పటివరకు మ్యాపింగ్ కాకుండా మిగిలిన స్కూళ్లను కూడా మ్యాపింగ్ చేశామని అధికారులు తెలిపారు.. ఇక, ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ప్రతిరోజూ ఒక ఇంగ్లిష్ పదాన్ని నేర్పేలా విద్యార్థులకు బోధన జరుగుతుందని వెల్లడించారు.. వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి డిజిటల్ లెర్నింగ్ ఉంటుందని.. ప్రతి మండలానికి ఒక కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల, ఒక మహిళా జూనియర్ కళాశాల ఉండేలా చర్యలు తీసుకుంటామని. జూనియర్ కళాశాలలు లేని మండలాలను గుర్తిస్తున్నట్టు సీఎంకు వివరించారు.. స్కూళ్లు, వసతులు తదితర అంశాలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుకు ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు..
Read Also: Foreign Tourist: ఇండియా చూద్దామని వచ్చా.. ఇలా జరుగుతుందనుకోలేదు..
Also Read
- OTR : ఇంటింటికీ టీడీపి.. గోదావరి జిల్లాలో గ్లాస్ ఎమ్మెల్యేల గందరగోళం
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
- OTR : కోఆర్డినేటర్లు మారినా మారని నేతలు.. అనంతపురంలో టిడిపికి తప్పని తలనొప్పి?
- OTR : అధిష్టానం పిలుపుతో తగ్గిన బొండా.. వైసీపీ నేతలపై విరుచుకుపడటం వెనుక రీజన్ ఏంటి?
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నత చదువులు చదువుకున్న టీచర్లు ఉన్నారు.. వారి సేవలను సమర్థవంతంగా వాడుకోగలిగితే.. నాణ్యమైన విద్య అందుతుందని స్పష్టం చేశారు.. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్న ఆయన.. మంచి చదువులు చదువుకున్న టీచర్ల సేవలను వాడుకునేందుకు విధానాలు రూపొందించామని తెలిపారు.. సబ్జెక్టుల వారీగా టీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం.. టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదని స్పష్టం చేశారు. అలా చేస్తే విద్యార్థుల చదువులు దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్న ఆయన.. టీచర్లు పూర్తిగా విద్యార్థుల చదువులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.. దీంట్లో భాగంగానే బోధనేతర కార్యక్రమాల్లో వారిని వినియోగించకుండా చూడాలని ఆదేశించారు. లెర్నింగ్ టు లెర్న్ కాన్పెప్ట్‌లోకి తీసుకెళ్లాలని ఆదేశించిన ఏపీ సీఎం.. కొత్తగా ఏర్పడనున్న 26 జిల్లాల్లో కూడా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉండాలని.. ప్రస్తుతం ఉన్న శిక్షణా కేంద్రాలలో నాడు – నేడు కింద సౌకర్యాలను మెరుగుపరచాలని తెలిపారు. స్కూళ్లలో నాడు – నేడు కింద ఏర్పాటు చేసుకున్న సౌకర్యాల నిర్వహణ బాగుండాలి.. లేకపోతే వ్యర్థమవుతుందన్న ఆయన.. మార్చి 15 నుంచి స్కూళ్లలో నాడు–నేడు రెండో విడత మొదలు పెట్టాలని ఆదేశించారు.. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యాకానుక అందించాలని స్పష్టం చేసిన సీఎం.. ప్రైవేటు కాలేజీల్లో కూడా సౌకర్యాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!