CM YS Jagan Delhi Tour: మళ్లీ హస్తినబాట.. రెండు రోజులు ఢిల్లీలోనే ఏపీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి హస్తినబాట పట్టనున్నారు.. ఈ సారి రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో మకాం వేయనున్నారు.. ఈ రోజు రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న ఆయన.. రేపు తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఇక, ఇవాళ మొదట శ్రీకాకుళం వెళ్లనున్న ఆయన.. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి హస్తినకు వెళ్తారు.. మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, మధ్యాహ్నం 3.40 గంటలకు ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగే స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.. సాయంత్రం 5.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి శంషాబాద్ చేరుకోనున్న ఆయన.. రాత్రి 6.55 గంటలకు నార్సింగి ఓమ్ కన్వెన్షన్‌లో జీవీ ప్రతాప్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.. ఇక, రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయల్దేరనున్న ఆయన.. రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
Read Also: Vice Presidential Poll: నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ధన్‌కర్ ఎన్నిక లాంఛనమే!
Also Read
- AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
- AP Inter Exams 2027: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 2027 పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ విడుదల
- Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
- Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
ఇక, రేపు ఉదయం 9.15 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకోనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 9.15 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో జరగనున్న నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.. సమావేశం అనంతరం సాయంత్రం 5.35 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగుపయనం కానున్న ఆయన.. రాత్రి 8.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక, తన ఢిల్లీ పర్యటనలో సీఎం ఇంకా ఎవరైనా కలుస్తారా? రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉండగా.. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో.. ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు.. సీఎం జగన్ పర్యటనలో భాగంగా ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
-
Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
-
Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
-
Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!