Site icon NTV Telugu

CM YS Jagan Delhi Tour: మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ కానున్న సీఎం జగన్

Ys Jagan

Ys Jagan

CM YS Jagan Delhi Tour:ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి హస్తిన వెళ్లనున్నారు.. రేపు ఢిళ్లీ వెళ్లనున్న ఆయన.. ఎల్లుండి వరకు అక్కడే గడపనున్నారు.. ఈ సారి తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు సీఎం జగన్‌.. రేపు సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు సీఎం.. రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న ఆయన.. ఆరు గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.. ఇక, రాత్రి 8.15 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్న సీఎం జగన్… రాత్రి 9.15 నిమిషాలకు 1-జన్ పథ్‌కు చేరుకుని.. రాత్రికి అక్కడే బసచేయనున్నారు. ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు ముఖ్యమంత్రి జగన్.. ఎల్లుండి మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ ఖరారైనట్టుగా తెలుస్తోంది.. ఈ సమావేశంలో.. పోలవరం ప్రాజెక్టుకు తుది అంచనాల ఆమోదం, కేంద్రం నుంచి పెండింగ్ నిధుల విడుదల, తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలను పరిష్కరించాలని ప్రధానిని కోరనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

Read Also: CBI Arrested Videocon CEO: వీడియోకాన్ గ్రూప్ సీఈవోను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు

కాగా, ఈ నెల మొదటివారంలోనూ ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సుకు సంబంధించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల ప్రధానితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఇప్పుడు మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న ఆయన.. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం కానుండడంతో.. ప్రాధాన్యత ఏర్పడింది.

Exit mobile version