CBI Arrested Videocon CEO: వీడియోకాన్ గ్రూప్ సీఈవోను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBI Arrested Videocon CEO: ఐసీఐసీఐ బ్యాంకు రుణాల మంజూరు కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) సోమవారం అరెస్టు చేసింది. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌కి సారథ్యం వహిస్తున్నప్పుడు వీడియోకాన్ గ్రూప్‌కు అందించిన రూ.3,000 కోట్లకు పైగా రుణంలో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ఆ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను సీబీఐ అరెస్టు చేసిన కొద్ది రెండు రోజుల తర్వాత ఇది జరిగింది. ముంబై కోర్టులో హాజరుపరిచిన తర్వాత కొచ్చర్‌లను ప్రస్తుతం అధికారులు విచారణ జరుగుతోంది.
2019లో అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం.. నేరపూరిత కుట్ర కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో దీపక్ కొచ్చర్, సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్వహిస్తున్న నూపవర్ రెన్యూవబుల్స్ (ఎన్‌ఆర్‌ఎల్) కంపెనీలతో పాటు కొచర్స్, ధూత్‌లను సీబీఐ నిందితులుగా పేర్కొంది.
Also Read
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Read Also: Akash Chopra: మయాంక్‌ను కెప్టెన్ చేయొద్దు.. చేస్తే తప్పదు భారీ మూల్యం
కేసు అభియోగాల ప్రకారం, వీడియోకాన్ గ్రూప్‌కు 2010- 2012 మధ్య బ్యాంకు రుణం మంజూరు చేసిన నెలల తర్వాత, క్విడ్ ప్రోకోలో భాగంగా వేణుగోపాల్ ధూత్ న్యూపవర్ రెన్యూవబుల్స్‌లో రూ.64 కోట్లు పెట్టుబడి పెట్టాడు. కొచ్చర్ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ రుణాన్ని క్లియర్ చేసిందని సీబీఐ ఆరోపించింది. ఆమె తన అధికారిక పదవిని దుర్వినియోగం చేసి, వీడియోకాన్‌కు రూ.300 కోట్లు మంజూరు చేసినందుకు ధూత్ నుంచి తన భర్త ద్వారా ప్రయోజనం పొందినట్లు ఏజెన్సీ పేర్కొ్ంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 20 బ్యాంకుల కన్సార్టియం నుంచి వీడియోకాన్ పొందిన రూ.40,000 కోట్ల రుణంలో ఇది భాగం.
Read Also: Pakistan: ఆర్థిక ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్న పాకిస్తాన్.. ఉద్యోగుల జీతాల్లో కోతలు
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ అయిన వీడియోకాన్ గ్రూప్‌కు అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలపై ఐసిఐసిఐ బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న చందాకొచ్చర్ 2018 అక్టోబర్‌లో వైదొలిగారు. ఆమె బ్యాంక్ ప్రవర్తనా నియమావళిని, అంతర్గత విధానాలను ఉల్లంఘించిందని ఐసిఐసిఐ బ్యాంక్ తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఆర్‌బిఐ మార్గదర్శకాలు, బ్యాంక్ క్రెడిట్ పాలసీని ఉల్లంఘిస్తూ ధూత్ ప్రమోట్ చేసిన వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు ఐసిఐసిఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల మేరకు రుణాలను మంజూరు చేసిందని సీబీఐ ఆరోపించింది.
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!