CM YS Jagan Delhi Tour: మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ కానున్న సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan Delhi Tour:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి హస్తిన వెళ్లనున్నారు.. రేపు ఢిళ్లీ వెళ్లనున్న ఆయన.. ఎల్లుండి వరకు అక్కడే గడపనున్నారు.. ఈ సారి తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు సీఎం జగన్.. రేపు సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు సీఎం.. రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న ఆయన.. ఆరు గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.. ఇక, రాత్రి 8.15 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్న సీఎం జగన్… రాత్రి 9.15 నిమిషాలకు 1-జన్ పథ్‌కు చేరుకుని.. రాత్రికి అక్కడే బసచేయనున్నారు. ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు ముఖ్యమంత్రి జగన్.. ఎల్లుండి మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఖరారైనట్టుగా తెలుస్తోంది.. ఈ సమావేశంలో.. పోలవరం ప్రాజెక్టుకు తుది అంచనాల ఆమోదం, కేంద్రం నుంచి పెండింగ్ నిధుల విడుదల, తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలను పరిష్కరించాలని ప్రధానిని కోరనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..
Read Also: CBI Arrested Videocon CEO: వీడియోకాన్ గ్రూప్ సీఈవోను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
కాగా, ఈ నెల మొదటివారంలోనూ ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సుకు సంబంధించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల ప్రధానితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఇప్పుడు మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న ఆయన.. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం కానుండడంతో.. ప్రాధాన్యత ఏర్పడింది.
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!