ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి గత ప్రభుత్వం అప్పులు చేసిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ.. ఒక దేశాన్ని తీసుకుని రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులుకు ముడిపెట్టడం మంచిది కాదన్నారు. శ్రీలంకలో వ్యవసాయ ఉత్పత్తి పడిపోయి దిగుమతులుపై ఆధారపడ్డారని.. దీంతో, శ్రీలంక జీడీపీ పడిపోయింది.. విదేశీ మారక ద్రవ్యంపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. ఒక దేశంలో ఇలాంటి పరిస్థితి రాష్ట్రానికి వర్తించదని స్పష్టం చేశారు. అయితే, శ్రీలకం పరిస్థితులను చూసిన తర్వాత దేశంలో కానీ, వివిధ రాష్ట్రాల్లో గానీ అప్పుభారం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించారని తెలిపారు. కోవిడ్, ఇతర కారణాల వల్ల కేంద్రం కూడా అప్పు చేసింది.. టీడీపీ ప్రభుత్వం ఒక్క ఏడాది కూడా నిబంధనలకు లోబడి వ్యవహరించకుండా అప్పులు చేసిందని వెల్లడించారు..
Read Also: Drug Smuggling: చెన్నైలో “వీడొక్కడే” సీన్.. ముంబైలో పట్టుబడిన డ్రగ్స్
కోవిడ్ కష్టాల్లో అన్ని రాష్ట్రాలు అప్పు చేశాయన్న ఆయన.. రాష్ట్ర విభజన సమయంలో లక్ష కోట్లుకు పైగా అప్పులు ఉన్నాయని విమర్శించారు.. టీడీపీ హయాంలో కూడా కేంద్ర అప్పు పెరిగింది.. అప్పులు రికార్డు అవ్వకపోవడం అనే సమస్యే ఉండదు.. ప్రతి అప్పు రికార్డులో ఉంటుంది.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.3.80 లక్షల కోట్లుగా వెల్లడించారు సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ. అయితే, తమ ప్రభుత్వం కేంద్ర నిబంధనలకు లోబడే అప్పులు చేసిందని స్పష్టం చేశారు.. ఏపీలో అప్పులు పెరిగినమాట నిజమే.. కానీ, కోవిడ్, ఇతర పరిస్థితుల వల్లే అప్పు పెరిగిందన్నారు. రాష్ట్ర విభజన నాటికి 1.34 లక్షల కోట్లుగా ఉందన్నారు.. ఇక, ఏపీలో ద్రవ్యలోటు చాలా తక్కువని వివరించారు. చంద్రబాబు హయాంలో ఏటా 19.4 శాతం అప్పులు ఉంటే.. ఇప్పుడు 15.77 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయని వెల్లడించారు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.39 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు దువ్వూరి కృష్ణ.