ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నేడు మరో ఇద్దరు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో ముఖ్యమంత్రి జగన్ నేడు సమావేశం కానున్నట్లు సమాచారం. నిన్న కేంద్ర మంత్రి ప్రకావ్ జవదేకర్‌తో భేటీ అయిన జగన్.. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌తో సమావేశం అయ్యారు. రాష్ట్ర అభివృద్ది, రాజధాని వికేంద్రీకరణకు సహకరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి కోరారు. నిన్న రాత్రి 9.03 గంటలకు అమిత్ షా నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్.. సుమారు 90 నిమిషాలు అమిత్ షాతో భేటీ అయ్యారు.