GSI 2023: అతిథుల కోసం ప్రత్యేక వంటకాలు.. ఘుమ ఘుమ లాడే ఆంధ్ర రుచులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GSI 2023: విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది.. 26 దేశాల నుంచి 15 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.. సమ్మిట్‌ను ఉద్దేశించి 21 మంది పారిశ్రామికవేత్తలు ప్రసంగించబోతున్నారు.. ఇప్పటికే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సహా పలువురు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నారు.. ఈ సమ్మిట్ ద్వారా 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరోవైపు.. దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఏపీలోని మూడు ప్రాంతాలలో ఫేమస్.. వెజ్, నాన్‌వెజ్ రుచులను వీరికి అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు..
Read Also: Global Investors Summit: పారిశ్రామిక వేత్తల చూపు.. విశాఖ వైపు.. నేటి నుంచి జీఐఎస్..
Also Read
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ఈ రోజు, రేపు విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) జరగనుంది.. అయితే, తొలిరోజు మధ్యాహ్నం భోజనంలో బొమ్మిడాయిల పులుసు, గుంటూరు కోడి వేపుడు, రొయ్యల మసాలా, మటన్ కర్రీ, చికెన్ పలావ్, వెజ్ రకాల్లో మష్రూం, క్యాప్సికం కూర, ఆలూ గార్లిక్ ఫ్రై, కేబేజీ మటర్ ఫ్రై, వెజ్ పలావ్, రోటీ, కుల్చా, పన్నీర్ బటర్ మసాలా, మెంతికూర–కార్న్ రైస్, మిర్చి కా సలాన్, టమాటా పప్పు, బీట్‌రూట్ రసం, మజ్జిగ పులుసు, గోభీ ఆవకాయ, నెయ్యి, వడియాలు, ద్రాక్ష పండ్ల పచ్చడి, చల్ల మిర్చి ఉంటాయి. అలాగే కట్ ఫ్రూట్స్, ఐస్‌క్రీం, పేస్ట్రీ, కాలా జామున్, జున్ను చంద్రకాంతలు సిద్ధం చేస్తున్నారు.. ఇక, రెండో రోజు అంటే శనివారం.. లంచ్‌లో రష్యన్ సలాడ్స్, వెజ్ సలాడ్‌లతో పాటు రుమాలి రోటీ, బటర్ నాన్ ఇస్తారు. నాన్ వెజ్ రకాల్లో ఆంధ్రా చికెన్ కర్రీ, చేప ఫ్రై, గోంగూర, రొయ్యల కూర, ఎగ్ మసాలా, మటన్ పలావ్.. వెజ్ ఐటమ్స్‌లో వెజ్ బిర్యానీ, కరివేపాకు రైస్, కడాయ్ పన్నీరు కూర, క్యారెట్ బీన్స్ కొబ్బరి ఫ్రై, వంకాయ మెంతి కారం, బెండకాయ–జీడిపప్పు ఫ్రై, పప్పుచారు, మిరియాల రసం, మజ్జిగ పులుసు, ఉలవచారు–క్రీం వంటివి ఉండబోతున్నాయి.. వీటితో పాటు కట్ ఫ్రూట్స్, ఐస్‌క్రీం, బ్రౌనీ, గులాబ్‌జామ్, అంగూర్ బాసుంది, డబుల్‌కా మీఠా ఇస్తారు. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, వడ, టమాటా బాత్, హాట్ పొంగల్, ఉదయం స్నాక్స్‌లో ప్లమ్ కేక్, డ్రై కేక్, వెజ్ బుల్లెట్, మఫిన్స్, స్ప్రింగ్ రోల్స్, సాయంత్రం స్నాక్స్‌లో కుకీస్, చీజ్ బాల్స్, డ్రై ఫ్రూట్ కేక్, ఫ్రూట్ కేక్, కట్ మిర్చి బజ్జీలు, టీ, కాఫీ ఏర్పాటు చేస్తారు.. మెనుకు అనుగుణంగా.. అన్ని వంటకాలకు అవసరమైన వివిధ పదార్థాలను సిద్ధం చేస్తున్నారు..
ఇక, పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తలు తరలిరావడంతో.. వారి కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. దేశీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల విస్తరణ, నూతన పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు పరిశ్రమలు సిద్ధమవుతున్నాయి. సీఎం జగన్ సమక్షంలో విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక ఎంవోయూలకు వేదికగా నిలవబోతోంది. ఈ సమ్మిట్‍కి 35 మంది టాప్ పారిశ్రామిక వేత్తలు, 25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, హైకమిషనర్‌లు తరలివచ్చారు.. సమ్మిట్ కోసం 12,000కుపైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయంటే.. పారిశ్రామిక వర్గాల నుంచి స్పందన ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!