Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thopudurthi Rajasekhar Reddy Arrest: అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో జైపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత ఏడాది జనవరి 25న తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు సోమలదొడ్డి గ్రామ సమీపంలోని రైల్వే పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై అప్పట్లో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అయితే తన కుమారుడి మృతికి వైసీపీ నేతలే కారణమని మృతుడి తండ్రి మల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఇక, దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆడియో, వీడియో రికార్డులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని ముంబై ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి వచ్చిన శాస్త్రీయ ఆధారాల ఆధారంగా అరెస్టులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదే సాక్ష్యాధారాలతో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో విచారించారు. తర్వాత ఆయనను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు సమాచారం. మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో మరికొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకోవడంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!