Tadipatri Violence: తాడిపత్రిలో రణరంగం.. కేతిరెడ్డి ఇంటిపై రాళ్ల దాడి! ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం! వాహనాలకు నిప్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tadipatri Violence: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల వేళ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల వ్యవహారం రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఇగడూరు, సజ్జలదిన్నె పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు నామినేషన్లు వేయవద్దంటూ కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కలకలం రేపాయి. ఈ క్రమంలో రాత్రి సమయంలో ఓ వైసీపీ నేతకు చెందిన స్కార్పియో వాహనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు సమాచారం.
బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
ఈ ఘటనల నేపథ్యంలో ఉదయం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇగడూరు, సజ్జలదిన్నె గ్రామాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. సర్పంచ్ నామినేషన్ల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, వాహనానికి నిప్పు పెట్టిన ఘటనపై బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే కేతిరెడ్డి పర్యటనతో తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా పెద్ద సంఖ్యలో మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read
- AP Panchayat Elections: సర్పంచ్ పదవికి వేలం పాట.. చీటీల పద్ధతిలో ఏకగ్రీవం..! ఎక్కువ మొత్తం రాసిన వ్యక్తికే పదవి!
- AP Panchayat Elections: రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తుల వినూత్న నిర్ణయం.! సర్పంచ్ పదవి వేలం..
- JC Prabhakar Reddy: అనంతపురం అభివృద్ధికి మేయర్ పార్టీ మారాలి.. జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
- Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడి
ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు.. ఈ దాడిలో ఇంటి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కేతిరెడ్డికి చెందిన సుమారు 10 స్కార్పియో వాహనాలు ధ్వంసమయ్యాయని చెబుతున్నారు.. బైకులకు కూడా నిప్పు పెట్టడంతో అవి దగ్ధమైన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కాయి.. ఇక, వరుస ఘటనలతో తాడిపత్రిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరువర్గాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే, సర్పంచ్ నామినేషన్ల విషయంలో మొదలైన వివాదం వాహనాలకు నిప్పు పెట్టడం, మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి, వాహనాల ధ్వంసం వరకు వెళ్లడంతో తాడిపత్రిలో తీవ్ర ఆందోళన నెలకొంది.
తాజావార్తలు
-
Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
-
CM Revanth Reddy: అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Tadipatri Violence: తాడిపత్రిలో రణరంగం.. కేతిరెడ్డి ఇంటిపై రాళ్ల దాడి! ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం! వాహనాలకు నిప్పు!
-
CM Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం.. 91 ఏళ్ల వయసులో తల్లి కన్నుమూత
-
BJP MLA Adinarayana Reddy: కూటమిలో జడ్పీ పీఠం చిచ్చు.. రాజీనామాకు ఎమ్మెల్యే సహా 20 మంది కౌన్సిలర్లు, 17 మంది ఎంపీటీసీలు రెడీ..?
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!