Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rayalaseema Water Project Row: అనంతపురం జిల్లాలో రాయలసీమ అభివృద్ధి, ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల అంశంపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్‌లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ సాగు, తాగునీటి సమస్యలను తీర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని అన్నారు. అదే స్ఫూర్తితో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారని పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు రాయలసీమకు అన్యాయం చేశారని, హైకోర్టు, ఎయిమ్స్ వంటి కీలక ప్రాజెక్టులను ఇతర ప్రాంతాలకు తరలించారని విమర్శించారు.
Read Also: Karimnagar: పోలీస్ శాఖలో నకిలీ ఐడీలతో జీతాలను చోరీచేసిన పోలీస్ అధికారి.. ఏకంగా రూ.1.40 కోట్లు
Also Read
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్‌పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
- Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
రాయలసీమ ప్రజలు టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చినప్పటికీ, వారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని చాలా మందికి తెలిసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు అవసరమని పిలుపునిచ్చారు.
ఇక మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ, తమకు తెలంగాణకు వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ సీఎం చెప్పారని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయడం దుర్మార్గమని అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి అనుమానాస్పదంగా ఉందని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితేనే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల లోతులో నీటిని తీసుకురావడం సాధ్యమవుతుందని, 854 అడుగుల్లో నీరు తరలించడం అసాధ్యమని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి వాటాలను సాధించవచ్చని చెప్పారు మాజీ మంత్రి శైలజానాథ్..
తాజావార్తలు
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!