MP Mithun Reddy: అరాచక పాలన.. భయపెట్టి పాలించడం మూర్ఖత్వం..!
- ఏపీ సర్కార్ పై మండిపడ్డ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి..
- రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోంది..
- భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy: ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ల సమావేశంలో పాల్గొన్న పార్టీ సీనియర్ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందన్న ఆయన.. భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు.. ఇంటింటికీ రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదని హితవుచెప్పారు.. అసలు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మద్యం కుంభకోణం జరగలేదని స్పష్టం చేశారు.. కట్టుకథలతో మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు.. ఇక, వైఎస్ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆపడం దారుణమైన విషయం అన్నారు.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయకుండా.. ప్రజల దృష్టిని మరల్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.. అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి విదేశీ నిధులు ఆపడం దుర్మార్గం అని ఫైర్ అయ్యారు.. హంద్రీనీవా లైనింగ్ పనులపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి..
Read Also: Vaibhav Suryavanshi: ఇది కదా సంస్కారం అంటే.. ధోనీతో వైభవ్..!
Also Read
- Kethireddy Venkatarami Reddy: సెలబ్రిటీల మౌనంపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. పద్మశ్రీల భయమా..?
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
- Minister Satyakumar: అమరావతిపై జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్.. ఎన్నికలకు వెళ్దామా..?
కాగా, ఏపీ ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మంగళవారం రోజు సంచలన వ్యాఖ్యలుచేసిన విషయం విదితమే.. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూనే అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.. ఇప్పుడు ఉన్న అధికారులు అన్యాయమైన పనులు చేస్తే.. రేపు మళ్లీ మన రోజు వస్తుంది.. ఇప్పుడు పేర్లు రాసిపెట్టుకొంది.. రిటైర్డ్ అయినా.. విదేశాలకు పారిపోయినా.. తీసుకొచ్చిన సినిమా చూపిస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే..
తాజావార్తలు
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!