JC vs Kethireddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది.. ఓవైపు హైకోర్టు ఆర్డర్‌తో తాడిపత్రి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నిస్తుండగా.. మరోవైపు పోటీగా కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇంకో వైపు.. కేతిరెడ్డి వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు.. దీంతో, ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.. అయితే, ఈ రోజు స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. కానీ, బుక్కాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.. రోడ్డుకు అడ్డంగా జీపులు పెట్టి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ముందుకు వెళ్లకుండా ఆపేశారు పోలీసులు.. హైకోర్టు ఆదేశాలు ఉన్నా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనుమతించడం లేదు పోలీసులు..
అయితే, తాను అనంతపురం వెళ్తానని పోలీసులకు చెప్పారు పెద్దారెడ్డి.. కానీ, తాడిపత్రికి వస్తే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకుంటామని జేసీ వర్గీయులు చెబుతున్నారు.. తాడిపత్రి పట్టణంలో నిన్న జరిగిన ఉద్రిక్తత ల నేపథ్యంలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరి ఆధ్వర్యంలో బెటాలియన్ సిబ్బంది, సివిల్ పోలీసుల మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.. ఎమ్మెల్యే జేసీ, మాజీ ఎమ్మెల్యే ల నివాసాల వద్ద కూడా మార్చ్ ఫాస్ట్ నిర్వహించిన పోలీసులు. అనంతపురం రోడ్ లోని ఫ్లై ఓవర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు కవాతు నిర్వహించారు.. అయితే, జేసీ వర్సెస్ కేతిరెడ్డి వ్యవహారం ఎటు దారితీస్తుంది అనేది టెన్షన్‌కు గురిచేస్తోంది..