JC Prabhakar Reddy Apologies: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎప్పుడైనా తగ్గేదేలే అనే తరహాలో వ్యవహరిస్తుంటారు.. కానీ, ఉన్నట్టుండి ఆయన యూ టర్న్ తీసుకున్నారు.. తన సహజశైలికి భిన్నంగా క్షమాపణలు కోరారు.. నమ్మశక్యంగా లేదు.. కానీ, ఇది నిజం.. ఆర్టీపీపీ వద్ద గత నెల 27 వ తేదీన ఫ్లై యాష్ వివాదం కొనసాగుతోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి వివాదానికి కారణమైన ఇరువురు నాయకులను హెచ్చరించిన మార్పు రాలేదు.. జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య మొదల్తెన ఫ్లై యాష్ వివాదంతో గత నెల రోజులుగా సిమెంట్ ఫ్యాక్టరీలో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి.. ఫ్లై యాష్ లోడింగ్ చేయకపోవడంతో నెల రోజులుగా జేసీ వర్గీయులకు చెందిన ఉన్న లారీలు అక్కడే ఆగిపోయాయి. ఈ వివాదంపై ఉన్నతాధికారులకు ఎన్ని లేఖలు పంపినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న వివాదంలో వాస్తవాలను అధికారులు ఎందుకు పట్టించుకోవలేదన్నారు.
Read Also: Air Travel: విమాన ప్రయాణికులకు అలర్ట్.. లగేజ్ బరువు, పరిమితిపై కొత్త నిబంధనలు..
ఇక, ఈ నేపథ్యంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి క్షమాపణలు చెబుతున్నాని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 30 వేల మంది సిమెంట్ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు.. తన వాళ్ల వారు ఇబ్బందులు పడుతున్నందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. గత ఐదేళ్లు చాలా నష్టపోయానని.. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు.. నియోజకవర్గ ప్రజల కోసమే తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు. వైసీపీ హయాంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ఇంటికి వచ్చిన సమయంలో.. ఒకటి సరెండర్ కావాలి.. లేదా ఊరు విడిచి వెళ్తారని అనుకున్నారు.. కానీ, అలాంటి సమయంలో నియోజకవర్గంలో ప్రజలు నా వెంటనడిచడంతో పోరాటం చేశానని తెలిపారు.
Read Also: Lava Yuva 2 5G: చెప్పిన తేదీకి ముందే మార్కెట్‌లోకి వచ్చేసిన లావా స్మార్ట్ ఫోన్
గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆవేదన వ్యక్తం చేశారు జేసీ. మా డీఎన్ఏ డిఫరెంట్ అని.. డబ్బులకు మమల్ని లొంగదీసుకోలేరని అన్నారు. నా పొగురు, ఫ్రిస్టేజ్ వళ్ల అన్నీ పొగొట్టుకున్నానని.. గత ఐదేళ్లు చాలా నష్టపోయాన్నారు. నాకు డబ్బు అన్నీ ఉన్నాయని.. కానీ, డబ్బు కోసం పాలిటిక్స్ లో వచ్చానని అనడం సరైంది కాదన్నారు. ఫ్లై యాష్ (బూడిద) విషయంలో డబ్బులు కోసం అంటున్నారని.. కానీ, అది నా ఫ్రిస్టేజ్ కోసమే అంతా చేశానన్నారు. వైసీపీ వాళ్లకు లొంగిపోయి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావని.. కానీ, చంద్రబాబు పై నమ్మకంతో ఆయన వెంట నడిచానని పరోక్షంగా వ్యాఖ్యనించారు. అయితే, నెల రోజులుగా నడుస్తున్న వివాదానికి ముగింపు పలకడానికే జేసీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే చర్చ సాగుతోంది.