Gummanur Jayaram: గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు.. రైలు పట్టాలపై పడుకోబెడతా..!

  • ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు..
  • తనపై చేసిన ఆరోపణలు నిరూపించే దమ్ముంటే వార్తలు రాయండి..
  • ఎవడో డబ్బులు ఇస్తాడని.. అమ్ముడుపోయి రాతలు రాస్తే ఖబర్దార్..
  • నిరూపించాలి.. లేదంటే.. రైలు పట్టాలపై పడుకోబెడతారని వార్నింగ్..
Gummanur Jayaram

Gummanur Jayaram

Gummanur Jayaram: మాజీ మంత్రి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కాస్తా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. గుంతకల్ పట్టణ శివారులోని ధోని మొక్కల లేఔట్ లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పలువురు అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం లేఔట్ లో గృహ నిర్మాణ లబ్ధిదారులకు సమస్యల గురించి ఆరా తీశారు.. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.. ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు.. గత ప్రభుత్వంలో కబ్జాకి గురైన ఇళ్ల పట్టాలు మొత్తాన్ని విచారణ చేయాలని అధికారులకు ఆదేశించారు.

Read Also: HIT : నాని నిర్మాతగా మాస్ మహారాజ్ హీరోగా

ఇదే సమయంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. తనపై చేసిన ఆరోపణలు నిరూపించే దమ్ముంటే వార్తలు రాయాలని సవాల్ విసిరిన జయరాం.. ఎవడో డబ్బులు ఇస్తాడని.. అమ్ముడుపోయి రాతలు రాస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.. తప్పు చేస్తే రాయండి.. ఆధారాలు లేకుండా రాస్తే తాటతీస్తినంటూ సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చారు.. కొంతమంది నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని, నా కుటుంబ పెత్తనం ఉందని అంటున్నారని.. అలాగే భూ అక్రమాలు చేశాను అని చెబుతున్నరన్నారు. వీటన్నింటినీ నిరూపించాలి.. లేదంటే.. రైలు పట్టాలపై పడుకోబెడతారని హెచ్చరించారు మాజీ మంత్రి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం..