Fighting in Wedding: పెళ్లిలో భోజనం విషయంలో గొడవ.. కర్రలతో దాడి

  • అనంతపురం జిల్లా గుత్తిలో ఓ పెళ్లి వేడుకలో ఘర్షణ..
  • వివాహ వేడుకలో భోజనం వడ్డించే విషయంలో వివాదం..
  • ఒక వర్గం మరో వర్గంపై కర్రలతో దాడి..
Fighting In Wedding

Fighting In Wedding

Fighting in Wedding: పెళ్లి వేడుక అంటే అంతా అట్టహాసంగా జరుగుతోంది.. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో హుషారుగా సాగుతోంది.. అయితే, భోజనం వడ్డించే విషయంలో చోటు చేసుకున్న చిన్న వివాదం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారినట్టు పెద్దది అయ్యింది.. చివరకు రెండు వర్గాలు పరస్పరం కర్రలతో దాడి చేసుకునేంత వరకు వెళ్లింది.. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది.

Read Also: NICDC: రాయలసీమలో పరిశ్రమలకు కేంద్రం పెద్దపీట.. ఎన్‌ఐసీడీసీకి రూ.872 కోట్లు విడుదల..

అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లిలో సోమవారం రాత్రి ఓ వివాహ వేడుకలో భోజనం వడ్డించే విషయంలో మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఒక వర్గం మరో వర్గంపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘర్షణలో ఓ వర్గానికి చెందిన మాబు, ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డారు. భోజనం వడ్డించే విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. మహమ్మద్ రసూల్, నూర్ భాషా, రెహనాతో పాటు మరో ఇద్దరు మాబు, ఆసిఫ్ పై కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో మహబూబ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.