Illegal Guns Case: అక్రమ ఆయుధాల కేసులో పురోగతి సాధించారు అనంతపురం పోలీసులు.. ఇప్పటికే ఆరుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించారు.. నిందితుల నుంచి రాబట్టిన సమాచారంతో మధ్యప్రదేశ్‌లో దాడులు చేశారు. అక్కడ తొమ్మిది అక్రమ ఆయుధాల తయారీ కేంద్రాలు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు 22 తుపాకీలు, 97 తూటాలు, 31 కేజీల గంజాయి, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. సంఘవిద్రోహుల చేతుల్లోకి అక్రమ ఆయుధాలు వెళ్తున్నాయని చెప్పారు. ఇప్పటికే అరెస్టు చేసిన ఆరుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొని వారం రోజులు పాటు విచారించాం.. నిందితుల నుంచి వచ్చిన సమాచారం మేరకు మధ్యప్రదేశ్ లో దాడులు నిర్వహించామన్నారు.. మధ్యప్రదేశ్‌లో 9 అక్రమ ఆయుధాల తయారీ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామన్నారు..
Read Also: CBI Investigations: హైదరాబాద్ లో సీబీఐ సోదాలు.. పాతబస్తీలో ఆరు చోట్ల అధికారులు తనిఖీలు
అయితే, ఆయుధాలు సంఘవిద్రోహ శక్తులకు చేరినట్లు సమాచారం ఉందన్నారు అనంతపురం జిల్లా ఎస్పీ.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాలని కోరుతున్నామని తెలిపారు.. వీరు దేశవ్యాప్తంగా ఆయుధాలు అమ్మినట్లు సమాచారం ఉందని.. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందన్నారు ఎస్పీ ఫక్కీరప్ప.. ఇప్పటి వరకు 22 తుపాకులు, 97 తూటాలు, 31 కేజీల గంజాయి, 2 కార్లు స్వాధీనం చేసుకున్నామని.. బుల్లెట్స్ పుణేలోని కిరికిలో తయార్తెయ్యానట్లు గుర్తించామన్నారు.. కాగా, అనంతపురం ఎస్పీ ఫకీరప్పను ఇప్పటికే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.. బెంగళూరుకు చెందిన ముఠా అనంతపురం మరియు బళ్లారి కేంద్రంగా కొంతకాలంగా అక్రమ ఆయుధాలు నకలి, నోట్ల దందా నిర్వహిస్తున్నారు. చాలా కాలంగా ఈ దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ ఆయుధాల తయారీదారులు మరియు డీలర్లు కలిపి 6 మందిని అరెస్టు చేసి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.. విచారణ తర్వాత తీగ లాగితే డొంక కదిలినట్టు.. అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి.