Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. NH-16పై వాహనాల రాకపోకలు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి రాత్రి 9 గంటల తర్వాత జాతీయ రహదారి-16 (NH-16)పై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో రాత్రి వేళ పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా పోలీసు శాఖ వెల్లడించింది. తుని వైపు నుంచి అనకాపల్లి మీదుగా వెళ్లే వాహనాలతో పాటు, విశాఖపట్నం, సబ్బవరం మీదుగా తుని వైపు వెళ్లే అన్ని రకాల వాహనాల రాకపోకలను రాత్రి 9 గంటల తర్వాత తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.
హైవేపై పోలీసుల పర్యవేక్షణ
రవాణా ఆంక్షలు అమలయ్యే జాతీయ రహదారి పరిధిలోని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHOs), హైవే పెట్రోలింగ్, మొబైల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేసేలా పర్యవేక్షించాలని సూచించారు. తుఫాను సమయంలో వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగం తెలిపింది.
Also Read
- Arnab Cyclone Effect : అర్నబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు
తుఫాను తీరం దాటే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. వాహనదారులు పోలీసుల ఆదేశాలను పాటిస్తూ, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. తుఫాను కారణంగా ఏదైనా ఆపద ఎదురైనా, అత్యవసర సహాయం అవసరమైనా ప్రజలు వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని జిల్లా పోలీసు శాఖ తెలిపింది. ఇందుకోసం డయల్ 112 లేదా 100 అత్యవసర నంబర్లకు ఫోన్ చేయవచ్చు. అలాగే అనకాపల్లి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 94409 04229ను సంప్రదించి సహాయం పొందవచ్చని అధికారులు సూచించారు. తుఫాను ప్రభావం తగ్గి, పరిస్థితులు అనుకూలించే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసు శాఖ జారీ చేసే సూచనలను పాటించాలని జిల్లా పోలీసు యంత్రాంగం కోరింది.
తాజావార్తలు
-
Trivikram : అందరి ముందే హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్!
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. NH-16పై వాహనాల రాకపోకలు బంద్
-
Saudi Arabia: సౌదీ రక్షణ శాఖపై క్షిపణి దాడి చేసిన హౌతీలు..
-
Saudi Houthi deal: శాంతి కోసం రూ. 9500 కోట్లు.. హౌతీలతో సౌదీ డీల్.?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికల నామినేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!