Blast in Firecracker Factory: ఫైర్‌వర్క్స్‌లో పేలుడు ఘటనపై ప్రభుత్వానికి చేరిన నివేదిక.. కారణం ఇదే..!
- కోనసీమ జిల్లా గజపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో పేలుడు..
- మానవ తప్పిదమే కారణంగా విచారణ నివేదికలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blast in Firecracker Factory: అంబేడ్కర్ కోనసీమ జిల్లా గజపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో పేలుడు ఘటనకు మానవ తప్పిదమే కారణంగా విచారణ నివేదికలో వెల్లడైంది.. అక్టోబర్ 8వ తేదీన జరిగిన ఘోర పేలుడు ప్రమాదంపై అధికార విచారణ జరిపారు. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్, రంగాల ఐజీ రవికృష్ణల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీకి, జిల్లా యంత్రాంగం తాజా నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో, ఫ్యాక్టరీ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్పష్టం చేశారు. సిద్ధమైన బాణసంచాను గిడ్డంగికి తరలించకుండా తయారీ కేంద్రంలోనే నిల్వ చేయడంతో పేలుడు తీవ్రత పెరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో అక్కడున్న బాధితులు, మునుపు పని చేసిన కార్మికులు, బాధితుల బంధువులు, స్థానికులు సహా దాదాపు 70 మందిని పోలీసులు విచారించారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా, సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకునే ప్రక్రియ వేగంగా సాగుతోందని అధికారులు చెబుతున్నారు.
Read Also: PM Modi: బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించనున్న మోడీ.. ఎప్పటినుంచంటే..!
Also Read
- Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..
- Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
- School Violence: శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం.. 6th క్లాస్ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన టీచర్స్..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..