CM Chandrababu: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కపాలేశ్వర స్వామి శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటన సంచలనంగా మారింది.. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని.. ఆరు పోలీసు బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా అనుమానితులను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.. అయితే, శివలింగాన్ని ధ్వంసం చేయడంపై స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.. శివలింగం ధ్వంసం ఘటనపై తాను జిల్లా ఎస్పీ, కలెక్టర్ తో పాటు జిల్లా మంత్రితో మాట్లాడినట్లు మంత్రి ఆనం చెప్పారు.. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. అయితే, ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు..
Read Also: YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు.. దేవతలను, మహిళలను కించపరిచారంటూ..!
ఘటనపై జరుగుతున్న దర్యాప్తు వివరాలను తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.. ధ్వంసమైవ శివలింగం స్థానంలో నూతన శివలింగం పునఃప్రతిష్ఠ చేసినట్టు సీఎంకు వివరించారు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి.. వేదపండితులు, అర్చకులతో శాస్త్రోక్తంగా పునః ప్రతిష్ట చేపట్టినట్టు మంత్రి ఆనం వెల్లడించారు.. దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో కార్యక్రమం నిర్వహించినట్టు సీఎం చంద్రబాబుకు వివరించారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి..
అయితే, ద్రాక్షారామ శివలింగం ధ్వంసంఘటనపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు.. తోటపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.. శ్రీనివాస్ మానసిక సమస్యతో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు.. పారలు, గునపాలు తయారు చేస్తున్న శ్రీనివాస్.. శివలింగం ధ్వంసం చేయడానికి గల కారణాల పై విచారణ చేపట్టారు పోలీసులు.. మరోవైపు, ద్రాక్షారామాకి వచ్చారు వైసీపీ నేతలు తోట త్రిమూర్తులు, పిల్లి బోస్, చిర్ల జగ్గిరెడ్డి.. ఇక, హైందవ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు..