Ambati Rambabu:ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పవన్ ఏది చేసినా వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైర్లు వేయడం.. ఆ సెటైర్లకు పవన్ కౌంటర్లు వేయడం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా మరోసారి పవన్ పై అంబటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ రాజకీయ నాయుకుడిగా ఎంత శ్రమిస్తున్నాడో నటుడిగా కూడా తనవంతు కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మొదటిసారి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా వెళ్లారు. నేడు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ ఎపిసోడ్ షూట్ మొదలయ్యింది. పవన్ ఫ్యాన్స్ హంగామా మధ్య పవన్ ను బాలయ్య ఆలింగనం చేసుకొని లోపలి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక ఈ షో కు పవన్ వెళ్లడంపై అంబటి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. “అన్నయ్య షో కి డుమ్మా.. బాలయ్య షో కి జమ్మ. రక్తసంబంధం కన్నా.. ప్యాకేజీ బంధమే గొప్పదా ?”అంటూ రాసుకొచ్చారు. పవన్ ఇప్పటివరకు ఏ షోకు వెళ్ళింది లేదు.. చివరకు చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించిన మీ ఎవరు కోటీశ్వరుడుకు కూడా పవన్ రాలేదు. ఇక చిరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు కూడా ఈ మధ్య పవన్ హాజరు కావడం లేదు. కానీ, ఇప్పుడు మాత్రం బాలయ్య పిలవగానే వచ్చాడు అని అంబటి చెప్పుకొచ్చారు. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం అంబటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అరవింద్ ఒప్పించడం వలనే పవన్ వచ్చారని, త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పక్కనే ఉండడంతో ఇది కేవలం సినిమాకు సంబంధించిందే తప్ప రాజకీయాలకు సంబంధించింది కాదని చెప్పుకొస్తున్నారు.
అన్నయ్య షో కి డుమ్మా
బాలయ్య షో కి జమ్మ
రక్తసంబంధం కన్నా
ప్యాకేజీ బంధమే గొప్పదా ?— Ambati Rambabu (@AmbatiRambabu) December 27, 2022