Ambati Rambabu: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రతాపరెడ్డిని సెప్టెంబరు 24వ తేదీన పోలీసులు అరెస్టు చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అప్పటి నుంచి ఇప్పుటి వరకూ జైలులోనే ఉన్నారు.. చంద్రబాబుపై ఇన్ స్టాలో పొలిటికల్ కామెంట్ పెట్టిన వ్యక్తికి ప్రతాపరెడ్డికి సంబంధం ఉందని అరెస్టు చేశారు.. చంద్రబాబు రైతులను బెదిరిస్తున్నారని ఇన్ స్టాలో ఎవరో పెట్టారు.. 41 రోజులుగా జైలులో ఉంచారు.. సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికి రెండు సార్లు పోలీసులు ప్రతాపరెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించారు.. అమ్మాయిల నగ్న వీడియోలతో డబ్బులు సంపాదిస్తున్నట్లు, వైసీపీ నుంచి డబ్బులు వస్తున్నాయని ఒప్పుకోవాలని పోలీసులు ఒత్తిడి చేశారని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Read Also: Shree Charani: అలుపెరగని ప్రయాణం.. పేదరికాన్ని జయించి, ప్రపంచ కప్ అందించిన ఆంధ్ర మహిళా క్రికెటర్
ఇక, అడ్వకేట్ ఉండడం వల్ల అది సాధ్యపడలేదని మాజీ మంత్రి అంబటి తెలిపారు. జోగి రమేష్ ను కూడా ఇలాగే తప్పుడు స్టేట్మెంట్లు తీసుకుని అరెస్టు చేశారు.. చిన్న చిన్న కేసులు పెట్టి వేధిస్తున్నారు.. తుఫాన్ వల్ల పంట దెబ్బతిందని చెబితే నష్టపరిహారం ఇవ్వమని బెదిరిస్తున్నారు.. మా వద్ద ఆధారాలు ఉన్నాయి.. తప్పుడు విచారణలను పోలీసులు మానుకోవాలి.. జోగి రమేష్ పై చంద్రబాబు, లోకేష్ కు కక్ష ఉంది.. ఎదో ఒక కేసు పెట్టి అరెస్టు చేయించాలని ప్రయత్నించారు.. దోషులు కానీ వారిని దోషులుగా చిత్రీకరించేందుకు తప్పుడు స్టేట్మెంట్లు తీసుకునే ప్రయత్నం దుర్మార్గం.. పోలీసులే దౌర్జన్యం చేసి తప్పుడు స్టేట్మెంట్లపై సంతకాలు తీసుకోవాలని చూస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.