YSRCP Protest: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు..
- నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన ర్యాలీలు..
- ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ఆందోళనలు..
- వైసీపీ శ్రేణులతో పాటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కలసి రావాలని పిలుపు..
- ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నూతన మెడికల్ కళాశాలలు నిర్వహించాలని డిమాండ్..
- ర్యాలీలకు అనుమతులు లేవంటూ వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Protest: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆ పార్టీ నేతల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టనుంది. ఈ ర్యాలీలో వైసీపీ శ్రేణులతో పాటు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు కలసి రావాలని పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ..
Read Also: Vemulawada Temple: వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత.. భక్తుల ఆగ్రహం!
Also Read
17 నెలల్లో 2.50 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఐదు వేల కోట్లను ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేయలేక పోతుందంటూ వైసీపీ మండిపడుతోంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ నిరనన ర్యాలీలకు హాజరు కావాలని కోరింది. 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలతో కలసి నిరసన ర్యాలీలు చేపట్టనుంది వైసీపీ. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నూతన మెడికల్ కళాశాలలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే, ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవంటూ వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు.
రాష్ట్రంలో 2019కి ముందు వరకు 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ఒకేసారి ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 మెడికల్ కళాశాలలను గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించటంతో 750 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.. పాడేరు, పులివెందుల మెడికల్ కళాశాలలు పూర్తి కాగా.. మిగతా 10 వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.. అయితే, ఈ కళాశాలలను కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్ లో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు సిద్దం కావటంతో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైసీపీ ఉద్యమ కార్యచరణ రూపొందించింది. ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ ప్రారంభించింది.. ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే 10 కొత్త వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే పూర్తై చేసుకుని అందుబాటులోకి వస్తాయని.. 17 నెలల్లో 2.50 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఐదు వేల కోట్లను ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేయలేక పోతుందంటూ నిరసన కార్యక్రమాలను మొదలు పెట్టింది..
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
-
IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
-
Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
-
Bhatti Vikramarka : బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దు..
-
O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!