YS Jagan: వారికి అభినందనలు తెలిపిన జగన్.. కూటమి సర్కార్‌పై ఫైర్
- యువత పోరు నిరసన కార్యక్రమాలపై స్పందించిన జగన్..
- 'యువత పోరు' విజయవంతం చేసినవారికి అభినందనలు..
- కూటమి సర్కార్‌పై విరుచుకుపడ్డ మాజీ సీఎం జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఏ అంశాన్ని కూడా వదలకుండా.. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఇక, యువత పోరు పేరిట జరిగిన నిరసన కార్యక్రమాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు వైఎస్ జగన్.. ‘యువత పోరు’ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారికి అభినందనలు తెలుపుతూనే.. కూటమి సర్కార్‌పై విరుచుకుపడ్డారు.. ‘చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు, ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు, పలు సమస్యలపై వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతీయువకులు “యువత పోరు’’ పేరిట రోడ్డెక్కి తమ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం కళ్లు తెరిచేలా బ్రహ్మాండంగా చేపట్టినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై నిన్న నరసరావుపేటలో పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాను.’
Read Also: Indian Railways: రైల్వే టికెట్ ఛార్జీల పెంపు.. ఎంతంటే..?
Also Read
- SEC: ఏపీలో మరో ఎన్నికల సందడి.. 13 వేల పంచాయతీలు, 23 మున్సిపాలిటీలపై ఫోకస్
- Illegal Mining : అక్రమ మైనింగ్‌కు చెక్.. ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
- CM Chandrababu: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. SIPBలో చంద్రబాబు కీలక ఆదేశాలు
- AP Local Body Elections: ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రీపోలింగ్ స్టార్ట్..
మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంతమందికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేల చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ, బాండ్లు ఇచ్చారు. చంద్రబాబుగారు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్ -2024 నుంచి వారి వారి ఖాతాల్లో జమ అవుతుందని, ప్రజలకు బాండ్లు రాసిమరీ ఇచ్చారు. టీడీపీ అధికార గెజిట్ ఈనాడు దినపత్రికలో రాష్ట్రంలో ఉపాధికోసం, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు కోటిన్నరపైనే ఉన్నారని రాస్తే, మీ మేనిఫెస్టో, మీరు ఇంటింటికీ పంచిన బాండ్ల ప్రకారం నెలకు రూ.3వేల చొప్పున ఈ ఏడాది కాలంలో మీరు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఒక్కరికీ ఇవ్వకపోగా, ఈ ఏడాది మళ్లీ ఎగరగొట్టే మోసానికి దిగారు అంటూ దుయ్యబట్టారు జగన్..
మరోవంక 2024 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అదే సంవత్సరం 2024లో చెల్లింపులు చేయాలి. ఎన్నికల కారణంగా అది నిలిచిపోయింది. అప్పటినుంచి ఈ జూన్-2025వరకూ 6 త్రైమాసికాలుగా మొత్తంగా రూ.4,200 కోట్లు పెండింగ్. ఇందులో ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. వసతి దీవెన కింద ఏప్రిల్-2024న చెల్లించాల్సిన ఒక విడత, ఈ ఏడాది ఏప్రిల్-2025 లో చెల్లించాల్సిన మరో విడత కలిపి రూ.2,200కోట్లు పెండింగ్. మొత్తంగా రూ.6,400 కోట్లకు గానూ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరు ఇవ్వకపోవడంతో ఇవాళ విద్యార్థులు చదువులు మానుకుని, పనులకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి అన్నారు జగన్… చంద్రబాబుగారూ మీరు చేయాల్సింది చేయకుండా, ఎగరగొట్టినందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నంచేస్తున్నారు. వీళ్లంతా చేసిన తప్పేమిటి? కేవలం కలెక్టర్‌ను కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడం తప్పా? మీరు ఇస్తామన్న వాటికోసం కూడా డిమాండ్ చేయడం తప్పా? మీ రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనకు నిన్న నరసరావుపేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా? రోజురోజుకూ మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ దౌర్జన్యాలు, మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి. అంటూ ట్వీట్ చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
.@ncbn గారి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు, ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు, పలు సమస్యలపై వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతీయువకులు “యువత పోరు’’ పేరిట రోడ్డెక్కి తమ నిరసన కార్యక్రమాన్ని… pic.twitter.com/TIp3bv8rOm
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 24, 2025
తాజావార్తలు
-
Mythology Movie Trend: వరుసగా పురాణాలేనా? ప్రేక్షకులకు విరక్తి తప్పదా.. ఇండస్ట్రీలో కొత్త చర్చ!
-
Abhijeet Dipke: ‘మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’.. దీపావళి సందర్భంగా అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్..
-
Cyber Crime: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. ‘పిన్ సర్వే’ సంస్థ నుంచి రూ. 8 కోట్లు లూటీ..
-
Ind Vs Pak: అండర్-19 ఆసియా కప్ 2026.. భారత్‌పై పాకిస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ..
-
Fire Accident: సీతాఫల్మండిలో టపాసుల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!