NTV Telugu Site icon

YS Jagan: అదానీ వ్యవహారంపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు.. వారిపై పరువునష్టం దావా..!

Jagan

Jagan

YS Jagan: సంచలనం సృష్టించిన అదానీ వ్యవహారంపై స్పందించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై వివరణ ఇచ్చారు.. తాము ప్రభుత్వానికి ఆదాయం పెంచామని.. కానీ, చంద్రబాబు ప్రభుత్వ ఆదాయాన్ని ఆవిరిచేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.. ఇక, ఇదే సమయంలో.. అదానీ కేసుల వ్యవహారంపై స్పందించారు.. అదానీపై నమోదైన కేసులో నా పేరు ఎక్కడా లేదన్నారు వైఎస్‌ జగన్‌..

Read Also: YS Jagan: ఏపీ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అది.. నేను మంచోడినా..? చంద్రబాబు మంచోడా..?

ముఖ్యమంత్రులను పారిశ్రామిక వేత్తలు కలుస్తారు.. పారిశ్రామిక వేత్తలను తీసుకు రావటం కోసం ప్రతి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు వైఎస్‌ జగన్‌.. ఐదేళ్ల కాలంలో అనేక అనేక మార్లు అదానీ కలిశారని తెలిపిన ఆయన.. ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు కూడా చేస్తున్నారని వెల్లడించారు.. అయితే, తనను అదానీ కలవడంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.. కేంద్ర ప్రభుత్వ, సేకి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందాలు జరిగాయి.. మూడో వ్యక్తి లేరని స్పష్టం చేశారు.. అయితే, తనపై అసత్య ప్రచారం చేస్తున్నవారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. తప్పుడు ఆరోపణలు చేసినవారిపై పరువునష్టం దావా వేస్తానని వార్నింగ్‌ ఇచ్చారు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

Read Also: Health Tips: వాయు కాలుష్యంతో పోరాడే 4 రకాల టీలు.. వీటితో శ్వాసకోశ సమస్యలకు చెక్

ఇక, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో తమ ప్రభుత్వ హయాంలో తప్పు జరిగిందనే విధంగా చూపించేందుకు కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఏపీ చరిత్రలోనే మా హయాంలో జరిగిందే అత్యంత చవకైన విద్యుత్‌ కొనుగోలు అని స్పష్టం చేశారు.. కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ ఇన్సెంటీవ్ ఇస్తామని చెప్పింది.. రూ.5.10 నుంచి రూ.2.49కి యూనిట్‌ ధర తగ్గింది.. మనకు 15 వే9ల మి.యూ. విద్యుత్‌ వినియోగం ఉంది.. దీని వల్ల లక్ష కోట్లు ఆదా చేయడం సంపద సృష్టి కాదా? అని ప్రశ్నించారు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంత మంచి ఆఫర్‌ వచ్చినప్పుడు.. దానిని పక్కన పెడితే మీరు నన్ను ఏమనేవారు? అని ప్రశ్నించిన జగన్.. సీఎం చంద్రబాబు తెలిసి తెలిసి చేస్తున్నది ధర్మేనా? అని నిలదీశారు.. ఇంత చవకైన ధరకు ఇంతకు ముందు ఎన్నడూ విద్యుత్‌ కొనుగోలు జరగలేదన్నారు వైఎస్‌ జగన్.. చంద్రబాబు హయాంలో 20214-19 మధ్య 133 పీపీఏలు చేశారు.. విండ్‌ పీపీఏలు యూనిట్‌కు రూ.4.80 చేసుకున్నారు.. ఇక, సోలార్‌ విద్యుత్‌ అయితే యూనిట్‌కు రూ.6.99 వరకు ఒప్పందాలు చేసుకున్నారని.. విండ్‌ పవన్‌ యావరేజ్‌ రూ.4.63కు యూనిట్‌ కొనుగోలు చేశారు.. సోలార్ పవర్‌ యావరేజ్‌ రూ.5.90కు యూనిట్‌ కొనుగోలు చేశారని చెప్పుకొచ్చిన జగన్‌.. కేంద్రం అంత మంచి ఆఫర్‌ ఇస్తే స్పందించిన నేను మంచోడినా..? అంత దిక్కుమాలని ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబు మంచోడా..? అని ప్రశ్నించారు.. చంద్రబాబు సోలార్ ఒప్పందాల వల్ల ఏడాదికి రూ.2 వేల కోట్ల అదనపు భారం.. 25 ఏళ్లకు అంటే రూ.50వేల కోట్లు అదనపు భారం అవుతుందనిన్నారు.. మేం లక్ష కోట్లు ఆదా చేసేందుకు ప్రయత్నిస్తే.. చంద్రబాబు 80 వేల కోట్లు ఆవిరి చేసే ఒప్పందాలు చేసుకున్నారని దుయ్యబట్టారు వైఎస్‌ జగన్‌..