Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ys Jagan Meeting With Mangalagiri Leaders

YS Jagan: మంగళగిరి నేతలతో వైఎస్ జగన్ సమావేశం..

Published Date :October 9, 2024 , 3:41 pm
By Rajesh Veeramalla
  • మంగళగిరి నేతలతో వైఎస్ జగన్ సమావేశం
  • మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి- జగన్
  • పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని భావించాం- జగన్
  • పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలి- జగన్
  • ఆ ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేశాం- జగన్.
YS Jagan: మంగళగిరి నేతలతో వైఎస్ జగన్ సమావేశం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మంగళగిరి నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని భావించామని తెలిపారు. అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టం చేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలి.. పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలి.. ఆ ఉద్దేశంతోనే ఈసమావేశం ఏర్పాటు చేశాం, పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నామని అన్నారు. అన్నింటికీ తట్టుకుని పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి ఉండాలని భావించి వేమారెడ్డిని ఇన్‌ఛార్జిగా నియమించామని జగన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి.. ఐదేళ్లపాలనలో ప్రతి ఇంటికీ మనం మంచిచేశాం.. ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టే పార్టీ వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని అన్నారు. బడ్జెట్‌తో పాటు సంక్షేమ క్యాలండర్‌ కూడా విడుదల చేసే వాళ్లం.. ప్రతినెలలో క్రమం తప్పకుండా బటన్‌ నొక్కి పథకాలు అమలు చేశామని జగన్ పేర్కొన్నారు. ఇది కేవలం ఐదేళ్ల వైయస్సార్‌ కాంగ్రెస్‌ పాలనలోనే జరిగిందని తెలిపారు.

Delhi: న్యూట్రిషన్ సెక్యూరిటీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

అనేక సంక్షోభాలను ఎదుర్కున్నాం.. కోవిడ్‌ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కున్నాం.. రెండేళ్ల పాటు కోవిడ్‌తో యుద్ధం చేశాం.. రాబడులు తగ్గిపోయాయి, ఖర్చులు విపరీతంగా పెరిగాయని జగన్ చెప్పారు. అయినా ఏ రోజు కూడా సాకులు చూపకుండా పథకాలు అమలు చేశామన్నారు. స్కూళ్లు, ఆస్పత్రులను మార్చాం.. మంచి వైద్యాన్ని గ్రామాలకే తీసుకు వచ్చాం.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గొప్ప మార్పులు తీసుకు వచ్చాం.. ఎప్పుడూ లేని విధంగా ఉచిత పంటల బీమాను అమలు చేశామని తెలిపారు. వివక్ష లేకుండా, రాజకీయాలు చూడకుండా పథకాలు ఇచ్చాం.. మనకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఆధారంగా పథకాలు ఇచ్చాం.. ప్రతి ఇంటి గడప వద్దకే పెన్షన్‌, రేషన్‌లే కాకుండా పథకాలూ అందించామన్నారు. దిశ యాప్‌ ద్వారా అక్కచెల్లెమ్మలకు భద్రత కల్పించాం.. 10 నిమిషాల్లోపే పోలీసులు వచ్చి భద్ర కల్పించేలా చేశామని వెల్లడించారు. ఇప్పుడు పరిస్థితులు ఏంటో మీరు చూడండి.. ప్రతి అంశంలోనూ తిరోగమనం కనిపిస్తుంది.. వివక్ష, పక్షపాతం కనిపిస్తున్నాయని ఆరోపించారు. ప్రతి ఇంట్లోనూ దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.. జగన్‌ పలావు పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు.. ఇప్పుడు పలావూ పోయింది.. బిర్యానీ పోయిందనే చర్చ జరుగుతోందని తెలిపారు.

Minister Narayana: మద్యం టెండర్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. మంత్రి ఆగ్రహం

ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారు.. ఆరోగ్య శ్రీ అటకెక్కింది.. బిల్లులు చెల్లించడం లేదని వైఎస్ జగన్ అన్నారు. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎగరగొట్టారు.. కొత్త మెడికల్‌ కాలేజీలన్నీ వెనకడుగు.. ప్రభుత్వం ఎందుకు ఉందో అర్థం కావడం లేదన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయాలి.. సంస్థాగతంగా అత్యంత బలంగా ఉండాలని జగన్ నేతలకు సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి.. కష్టాల నుంచే నాయకులు పుడతారన్నారు. తనను16 నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా వేధించారు.. అయినా ప్రజల ఆశీస్సులతో మనం ముందడుగు వేశాం.. కష్టాలు ఎక్కువ కాలం ఉండవని చెప్పారు. రెడ్‌బుక్‌ అనేది ఏమైనా పెద్దపనా..? అని జగన్ ప్రశ్నించారు. ఎప్పుడూ లేని దుష్ట సంప్రదాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీసుకు వచ్చింది.. ఇప్పుడు తాను చేయొద్దని చెప్పినా తమ వాళ్లు కూడా బుక్స్‌ మెయింటెన్‌ చేయడం మొదలుపెడుతున్నారు.. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారు.. అదే సమయంలో తాము గుడ్‌బుక్‌ కూడా రాసుకోవడం మొదలుపెట్టామన్నారు. పార్టీకి మంచి చేసిన వారిని, కష్టపడే వారి పేర్లను కూడా రాసుకుంటున్నాం.. వారికి తప్పకుండా అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయని జగన్ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mangalagiri leaders
  • Meeting
  • telugu news
  • ycp
  • ys jagan

తాజావార్తలు

  • Sundar Pichai: గూగుల్ పిచాయ్‌కు ఇచ్చే ప్యాకేజీతో ఒక చిన్న దేశాన్నే కొనొచ్చు తెలుసా!

  • India Post GDS Result 2026: గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు.. ఎంపికైన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • Preity Zinta: వరుసగా ఆస్తులు అమ్మేస్తున్న ప్రీతీ జింటా.. ఎందుకంటే ?

ట్రెండింగ్‌

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • India Playing XI vs NZ: ప్రపంచ కప్ ఫైనల్‌ జట్టులో కీలక మార్పు.. న్యూజిలాండ్ కు ఉచ్చు బిగుసుకున్నట్లే.!

  • అక్కడ వెంట్రుకలు కేవలం వయసు పెరగడం వల్లే కాదు.. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలివే.!

  • Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions