YS Jagan: మూడేళ్ల తర్వాత అధికారంలోకి రాబోతున్నాం.. ఇప్పుడు పార్టీ కోసం పని చేస్తున్న వారెవ్వరినీ జగన్ 2.0లో మర్చిపోం.. పక్కాగా డేటా బేస్ తయారు చేయమని మన లీగల్ విభాగం ప్రతినిధులకు చెబుతున్నాను.. ఆ డేటా బేస్ ఆధారంగా వారందరికీ తగిన గుర్తింపు ఇస్తాం అన్నారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ లీగల్‌సెల్ సమావేశం నిర్వహించారు వైఎస్ జగన్.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు హాజరయ్యారు.. వైసీపీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి (లీగల్) పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో పాటు, పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.. ఇంకా త్వరలోనే ఒక యాప్ వస్తుంది. దాని తయారీలో సీనియర్ లాయర్లు కూడా పాలు పంచుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ, ఏ వైసీపీ కార్యకర్తకు అన్యాయం జరిగినా.. ఆ యాప్ ఓపెన్ చేసుకుని, తన పూర్తి వివరాలు, తనకు జరిగిన అన్యాయం, అది ఎవరి వల్ల జరిగింది? దానికి సంబంధించి ఉన్న ఆధారాలు అప్‌లోడ్ చేస్తే చాలు. అది ఆటోమేటిక్‌గా ఇక్కడ మన డిజిటల్ లైబ్రరీలో నిక్షిప్తం అవుతుంది. రేపు మనం అధికారంలోకి రాగానే, ఆ డేటా ఓపెన్ చేసి చూస్తాం. ఇప్పుడు వేధిస్తున్న వారెవ్వరినీ వదలిపెట్టబోం. చట్టం ముందు వారిని నిలబెడతాం. చట్టం తన పని తాను చేసుకు పోతుంది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టం. జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు జగన్..
Read Also: Dr Namrata: ముగిసిన డాక్టర్ నమ్రత 5 రోజుల కస్టడీ.. వెలుగులోకి ఆకృత్యాలు..!
ప్రతిపక్షంగా కష్టకాలంలో ఉన్న పార్టీకి, ఇప్పుడు లాయర్లు అందిస్తున్న సేవలు అభినందనీయం అన్నారు జగన్.. పార్టీ కార్యకర్తలపై తప్పుడు సాక్ష్యాలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న ఈ సమయంలో పార్టీకి పెద్దన్నల్లా లాయర్లు పని చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. కలియుగం అంటే ఏమిటన్నది ఈ 14 నెలల చంద్రబాబు పాలన చూస్తే అర్ధమవుతుందన్న శ్రీ వైయస్ జగన్, ఈ కాలంలో ఎక్కడా న్యాయం, ధర్మం లేదని తేల్చి చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు. ఈ సందర్భంగా మీరు పోషిస్తున్న పాత్ర ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు పార్టీకి అన్ని విధాలుగా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. అడగకపోతే అమ్మ అయినా అన్నం పెట్టదు అన్నట్లుగా.. కోరకపోతే దేవుడు కూడా దేవుడు కూడా వరిమివ్వడు అన్నట్లుగా.. పిటిషన్లు వేసి, మీరు న్యాయస్థానంలో నిలబడకపోతే, న్యాయం కూడా దక్కదు. అందుకే మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయం. కలియుగం అంటే ఏమిటన్నది చంద్రబాబునాయుడుగారి 14 నెలల పరిపాలన చూస్తే తెలుస్తుంది. ఇదే కలియుగం అనేది కనిపిస్తుంది. ఎక్కడా న్యాయం లేదు. ధర్మం లేదన్నారు..
Read Also: Telangana : ఇరిగేషన్ శాఖలో ఎనిమిది మందికి చీఫ్ ఇంజనీర్ పదోన్నతులు
తమకు గిట్టని వారు, నచ్చని వారు ఎవరైనా ఉంటే, ఎవరైనా తమ స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకుని, జీర్ణించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్.. ఎలాగైనా తీసుకుని పోయి వారిని జైల్లో వేయాలి. ఎలాగైనా వారిని తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టాలి. వారి పరువు తీయాలనే నీచమైన సంస్కృతి ఈరోజు చూస్తున్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే తన పరువు, ప్రతిష్టతో ఆడుకోవడం. అవన్నీ తెలిసి కూడా, ఏ తప్పు చేయకపోయినా కూడా బరద జల్లుతున్నారు. తప్పు చేశాడు అని చెప్పి, దాని కోసం దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. కేసులు పెడుతున్నారు. వాటికి అసలు అసలు ఆధారాలు, సాక్ష్యాలు ఉండవు. ఏ కేసు చూసినా మోడస్ ఆపరెండి ఒక్కటే. తొలిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం అన్నారు.. ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడం కోసం, బాధితుల తరపున గట్టిగా నిలబడి వారి స్వరం వినిపించాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అంటే, మన భుజాల మీద బాధ్యత మరింత పెరిగింది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ చూడనివి ఇప్పుడు చూస్తున్నాం. ఏదైనా సరే, న్యాయం, ధర్మం జరగాలంటే, బాధితులకు న్యాయం జరగాలంటే, వారి తరపున ఎవరైనా నిలబడతారంటే మీరే. అందుకే మీ పాత్ర చాలా ముఖ్యం. కాబట్టి మీరు పోషించే పాత్ర చాలా గొప్పది. మీ పాత్ర చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా కష్టకాలంలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్దన్నగా మీరు చేస్తున్న పాత్ర, పార్టీ ఎప్పటికీ మర్చిపోదు.
Read Also: Daddy Movie: ‘డాడీ’లో చిరంజీవి కూతురు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
గతంలో మనం లాయర్లు, లీగల్ కమ్యూనిటీకి ఏం చేశామనేది నా కంటే, మీరే బాగా చెబుతారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎవరూ ఊహించని విధంగా యువ న్యాయవాదులకు ప్రభుత్వం నుంచి క్రమం తప్పకుండా ‘లా నేస్తం’ ఇచ్చాం అని గుర్తుచేశారు జగన్… అలా యువ లాయర్లకు అండగా, తోడుగా నిల్చాం. నిజంగా అట్టడుగు వర్గాలకు తోడుగా ఉండాని, జీపీలు, ఏజీపీల నియామకాల్లో 52 శాతం రిజర్వేషన్ ఇచ్చాం. గతంలో ఎప్పుడూ అలా ఎవరూ చేయలేదు. అది కేవలం వైయస్సార్‌సీపీ హయాంలోనే జరిగింది. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించి, అందులో రూ.25 కోట్లు ఖర్చు చేశాం. ఇంకా అప్పుడు లాయర్ల ఇన్సూరెన్స్ పథకానికి కూడా మూడో వంతు ప్రభుత్వమే చెల్లించింది. ఇవన్నీ కూడా కేవలం వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే జరిగాయి. ఇవన్నీ కూడా అప్పట్లో గర్వపడే విధంగా చేశాం. దాన్ని పార్టీ కూడా చెప్పుకోగలదు అన్నారు. కూటమి ప్రభుత్వంలో చివరకు లాయర్లను కూడా మోసం చేశారు. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ ఏవీ లేవు. అంతా మోసం. మన ప్రభుత్వంలోని పథకాలన్నీ రద్దు చేశారు. వారి హామీలు మోసాలుగా మారాయి. మరోవైపు అన్ని వ్యవస్థలు దిగజారిపోయాయి. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగం, శాంతి భద్రతలు ఇంకా పరిపాలనలో పారదర్శకత.. ఏది తీసుకున్నా అన్నీ అస్తవ్యస్తం. అన్నింట్లో తిరోగమనం. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు వైఎస్ జగన్..
Read Also: Satya Pal Malik: జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ కన్నుమూత..
గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్టుషాప్‌లు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం అమ్ముతున్నారు. అందుకోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. అలా బెల్టు షాపులు అప్పగిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మిస్తున్నారని ఆరోపించారు జగన్.. ఇది కళ్ల ముందు కనిపిస్తున్న పచ్చి నిజాలు. ఎక్కడా చూసినా చట్ట విరుద్ధంగా పర్మిట్ రూమ్‌లు. అక్కడ మద్యం బాటిళ్లు కాకుండా, పెగ్‌ల ద్వారా మద్యం అమ్ముతున్నారు. అదీ చట్ట విరుద్ధమే. అది కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువే. ఇసుక ఫ్రీ అన్నారు. కానీ ఎవరికీ ఇవ్వడం లేదు. అంతా దోపిడి. గతంలో మన ప్రభుత్వంలో ఇసుక సరఫరాలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు రాయల్టీగా వచ్చేది. ఇప్పుడు అది రాకపోగా, ఇసుక ధర రెట్టింపు అయ్యిందన్నారు జగన్.. ఏ నియోజకవర్గం తీసుకున్నా కళ్ల ముందే పేకాటలు. క్లబ్‌లు. వాటన్నింటినీ ఎమ్మెల్యేలు నడిపిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. ఇది కూడా కళ్ల ముందే కనిపిస్తున్న నిజం అని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్..
