దశాబ్దాల కలగా మిగిలిన కొల్లేరు సమస్యల పరిష్కారం ఎదురు చూస్తున్నారు ఇక్కడి ప్రజలు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో త్వరలోనే అది సాధ్యమవుతుందని కూడా నమ్ముతున్నారట. ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీ నేతలు కొందర్ని అనుమానాలు, అసంతృప్తి వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణాలు కూడా గట్టిగానే ఉన్నాయి. కేంద్ర సాధికారిక కమిటీ ఇటీవల కొల్లేరు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. రెండు రోజుల పాటు అయా ప్రాంతాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతి పత్రాలు స్వీకరించింది.
కూటమి ప్రభుత్వ నేతలు అక్రమ కేసులు పెట్టి వైసీపీ కేడర్‌ని వేధించాలని చూస్తున్నారని వైసీపీ పబ్లిసిటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మండిపడ్డారు. కూటమి నేతలు ఎంత అణిచివేయాలని చూస్తే.. తాము అంత పెద్దగా ఎదుగుతామన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి.. సీఎం చంద్రబాబుకు వెన్నులో వనుకు పుడుతోందన్నారు. రైతుల పరామర్శకు మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లినప్పుడు వేలాదిగా జనం తరలివచ్చారని కాకుమాను రాజశేఖర్ పేర్కొన్నారు. నేడు అమరావతిలో కాకుమాను…
ఎవ్వరినీ వదలం.. ఎక్కడున్నా.. కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి అని సూచించారు వైఎస్ జగన్.. ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. అది మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చారు..