NTV Telugu Site icon

YS Jagan: కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Ys Jagan

Ys Jagan

YS Jagan: కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష.. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు జగన్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. రాష్ట్రంలో రెడ్‌ బుడ్‌ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు.. వ్యవస్ధలన్నీ కూప్పకూలిపోయిన పరిస్దితి కనిపిస్తోంది. దొంగకేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగులు పెట్టినా, ఫార్వార్డ్‌ చేసినా కూడా కేసులు పెడుతున్నారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. మన ప్రభుత్వానికి, చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ప్రజలు పోల్చి చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రతి ఇంట్లోనూ చర్చ నడుస్తుంది. జగన్‌ కుటుంబమంతటికీ మేలు చేశాడు. చంద్రబాబు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు చేస్తానన్న ప్రలోభాలకు మొగ్గు చూపిన పరిస్థితులు చూశాం అన్నారు..

Read Also: Income Tax Department: ఇక్కడ దోచుకుంటున్నారు.. అక్కడ దాచుకుంటున్నారు.. దుబాయ్‌లో భారతీయుల ఆస్తులు

ఇక, చంద్రబాబు సాధ్యం కాని హామీలిచ్చారని విమర్శించారు వైఎస్‌ జగన్‌. మనకు అబద్దాలు చెప్పడం చేతగాదు. మన పాలనలో చక్కగా బటన్లు నొక్కాం. కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనని ప్రజలు ఆశపడ్డారు.. కానీ ఆరునెలలు తిరక్కమునుపే వాస్తవం అర్ధమయిందన్నారు.. ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరుగుతోంది. ప్రతి వ్యవస్ధ కుప్పకూలిపోతుంది. ఫీజులు ఇవ్వక పిల్లలు కాలేజీలకు వెళ్లలేని దుస్థితి. జనవరి నాటికి ఏడాది ఫీజులు పిల్లలకు ఇవ్వని పరిస్థితి ఉంది.. ఆరోగ్యశ్రీకి బకాయిలు రూ.2,200 కోట్లు పెండింగ్‌ పెట్టారు.. 108, 104 డయల్‌ చేసినా ఆంబులెన్స్‌ వస్తుందన్న పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోలు పరిస్థితి దయనీయంగా ఉంది. రైతులు ఎంఎస్పీ కంటే రూ.300 తక్కువకు అమ్ముకుంటున్నారంటూ ప్రభుత్వ తీరుపై జగన్‌ తీవ్ర ఆక్షేపణ చేశారు..

Read Also: Tamil Nadu: ‘‘ఖాకీ’’ సినిమా లాగే.. ఫామ్ హౌజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య..

నేను మీ అందరికీ కోరేది ఒక్కటే.. మనలో పోరాట పటిమ సన్నగిల్లగూడదని ధైర్యాన్ని చెప్పారు వైఎస్‌ జగన్‌.. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష సమయం అన్నారు.. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు.. బెయిల్‌ కూడా ఇవ్వలేదు అంటూ తన నిజజీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను గుర్తుచేసుకున్నారు.. అయితే, అయినా తాను ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యాను అన్నారు వైఎస్‌ జగన్‌.. గతంలో వైసీపీకి 151 స్థానాలు వచ్చాయి.. కానీ, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ కి పరిమితం చేయాలని సూచించారు.. అబద్ధం, మోసాలు చేస్తూ మంచి చేయని వారిపై ప్రజలకు కోపం వస్తుంది.. మనపై ప్రేమ పెరుగుతుంది.. మోసమే పరమావధిగా ఉన్న వారిని ప్రజలు ఏం చేస్తారో మనం చూస్తాం అని వ్యాఖ్యానించారు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..