YS Jagan: ‘హలో ఇండియా’ అంటూ జగన్ పోస్ట్.. కూటమి సర్కార్‌పై సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో చట్టపాలన స్థానంలో భయపాలన నెలకొంటోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘హలో ఇండియా’ అంటూ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో రాష్ట్రంలో ప్రజలు న్యాయం కోసం కాకుండా పోలీసులకే భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. గాదె సాయికృష్ణ కస్టడీ మరణం రాష్ట్రాన్ని కలవరపెడుతోందని జగన్ పేర్కొన్నారు. సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారంటూ ఆరోపించారు. అలాగే పోలీసుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసిన అనంతరం క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను కూడా ప్రస్తావించారు.
‘రెడ్ బుక్ పాలన’పై తీవ్ర విమర్శలు
టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రెడ్ బుక్ పాలన’ వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని జగన్ ఆరోపించారు. పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారమా, లేక రెడ్ బుక్ ప్రకారమా పనిచేస్తున్నారనే ప్రశ్నను లేవనెత్తారు. రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా కార్యకర్తలు, జర్నలిస్టులు, మేధావులు లక్ష్యంగా మారుతున్నారని విమర్శించారు. ఇక, తునిలో తిరుపతమ్మ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళావతి, కర్నూలు జిల్లా గంగమ్మ ఘటనలను ప్రస్తావిస్తూ పోలీసు వేధింపుల ఆరోపణలతో వరుసగా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఇవి యాదృచ్ఛిక సంఘటనలు కాదని, పోలీసు వ్యవస్థలో ప్రమాదకర ధోరణికి సంకేతమని వ్యాఖ్యానించారు.
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్
రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితులకు బాధ్యత వహించాలని జగన్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే పాలన సాగాలని, పోలీసులు ప్రజల హక్కులను కాపాడే వ్యవస్థగా ఉండాలని అన్నారు. న్యాయం స్థానంలో భయం, చట్టం స్థానంలో అధికారం వస్తే ప్రజాస్వామ్యమే బలైపోతుందని హెచ్చరించారు. అయితే, ఏపీలో చట్టపాలన స్థానంలో భయపాలన నెలకొంటోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. సాయికృష్ణ కస్టడీ మరణం, క్రాంతి కుమార్ ఆత్మహత్య వంటి ఘటనలు ఒక్కో సంఘటన మాత్రమే కాదని, రాష్ట్రంలో పెరుగుతున్న పోలీసు వేధింపుల సంస్కృతికి ఇవి నిదర్శనాలని తన ట్వీట్లో పేర్కొన్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
𝐇𝐞𝐥𝐥𝐨 𝐈𝐧𝐝𝐢𝐚 !!! 𝐓𝐡𝐞 𝐫𝐮𝐥𝐞 𝐨𝐟 𝐟𝐞𝐚𝐫 𝐢𝐬 𝐫𝐞𝐩𝐥𝐚𝐜𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐫𝐮𝐥𝐞 𝐨𝐟 𝐥𝐚𝐰.
Has Andhra Pradesh reached a point where people fear the police most?
Be it custodial death of Gade Sai Krishna, whose body was allegedly cremated secretly by the…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 20, 2026
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!