YS Jagan: 2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ పెరిగింది.. జగన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ నాయకులతో చర్చించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పలు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు, పార్టీ విజయాలు, ఓటింగ్ శాతాలు, ఎన్నికల నిర్వహణలో జరిగినట్లు భావిస్తున్న అక్రమాలపై నాయకులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పార్టీ కేడర్ మొత్తం ఎంతో కసితో, పట్టుదలతో ఎన్నికల్లో పోరాటం చేసిందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలను ప్రజలంతా చూశారని, వాస్తవాలను ప్రజలు కూడా బాగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. 2024 ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఓటింగ్ శాతం పెరిగిందని వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ అరాచకాలు, అన్యాయాలు చోటుచేసుకున్నప్పటికీ వైసీపీ ఓటింగ్ శాతం పెరగడం పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగి ఉంటే వైసీపీకి మరింత భారీగా ఓటింగ్ శాతం నమోదయ్యేదని జగన్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలు బయటపడితే తన ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందనే భయంతోనే చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి చంద్రబాబు సరికొత్త విధానాలను ప్రవేశపెట్టారని విమర్శించారు. అన్ని అడ్డంకులను అధిగమించి వైసీపీ విజయం సాధించిన చోట కూడా అక్రమాలకు పాల్పడి ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారని, లేని విషయాలను సృష్టించి అబద్ధాలు ప్రచారం చేశారని జగన్ విమర్శించారు. ఇప్పుడు అదే చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి, వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇన్ని దుర్మార్గాలకు పాల్పడిన తర్వాత ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
Also Read
- AP High Court: పండుగలు, సెలవుల్లో బస్సు టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
- Cyclone Threat : మురసు, అర్నబ్ తర్వాత మరో అల్పపీడనం.. ఏపీకి టెన్షన్
- Annapareddy Vijaya Bhaskar Reddy: వైసీపీకి మరో షాక్.. పార్టీకి సీనియర్ నేత అన్నపరెడ్డి గుడ్‌బై.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీలో చేరుతా!
- AP MPP, ZPP Indirect Elections 2026: స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. MPP, ZPP ఎన్నికల తేదీలు ఖరారు!
ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలు ఎప్పుడూ చూడలేదు..
జగన్‌ను కలిసిన వివిధ జిల్లాల నాయకులు తమ రాజకీయ జీవితాల్లో ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్లకు బదులుగా బౌన్సర్లను ఏర్పాటు చేసి లెక్కింపు ప్రక్రియను నిర్వహించారని నాయకులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల బంధువులను కిడ్నాప్ చేసి నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపు సమయంలో చెల్లని ఓట్ల పేరుతో పెద్ద సంఖ్యలో వైసీపీ ఓట్లను తొలగించారని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థులు గెలిచిన చోట పదేపదే రీకౌంటింగ్ నిర్వహించి లెక్కల్లో మార్పులు చేశారని, అయితే వైసీపీ నేతలు కోరిన చోట మాత్రం రీకౌంటింగ్‌కు అవకాశం కల్పించలేదని నాయకులు వెల్లడించారు. అధికార పార్టీకి అనుకూలంగా అదనపు బ్యాలెట్ పేపర్లు అందించి, ఆ పార్టీ అభ్యర్థులు గెలిచేలా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
గ్రామగ్రామాన చంద్రబాబు బాధితులు ఉన్నారు..
ఈ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు చేయించిన దాడుల కారణంగా రాష్ట్రంలోని గ్రామగ్రామాన బాధితులు ఉన్నారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో తమ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని జగన్‌కు వివరించారు. ఎన్నికల షెడ్యూల్ నుంచి ఫలితాల ప్రకటన వరకు జరిగిన పరిణామాలను పార్టీ నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు, అక్రమాలపై పార్టీ నాయకులతో చర్చించిన జగన్.. పార్టీ శ్రేణులు ధైర్యంగా పోరాటం చేశాయని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
YS Jagan: 2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ పెరిగింది.. జగన్ కీలక వ్యాఖ్యలు
-
Chery Tiggo: విరిగిన యాక్సిల్.. ఊడిపోయిన చక్రాలు! భారత్ మార్కెట్లోకి రాకముందే చైనా కార్ల బ్రాండ్ పరువు గాల్లోకి..
-
Sonia Gandhi Book: అన్నా హజారే ఉద్యమం, ఆర్ఎస్ఎస్ స్థాపన, అహ్మద్ పటేల్ మరణం.. సోనియా పుస్తకంలో చారిత్రక తప్పులు
-
Vijayasai Reddy: ఏపీ రాజకీయాల్లో సాయిరెడ్డి మరో సంచలనం.. 2029 ఎన్నికలపై కీలక ప్రకటన.. పీఆర్పీ టార్గెట్ 175..!
-
Upcoming Movies: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా.. ఇయర్ ఎండ్‌లో థియేటర్లను షేక్ చేయనున్న భారీ చిత్రాలివే..!
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!