YS Jagan: అమరావతి అవినీతి గని.. MAVIGUN ప్రణాళికే బెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్.. అమరావతి పేరుతో భారీ అవినీతి, దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. అందుకే ప్రత్యామ్నాయంగా MAVIGUN ప్రణాళికను ప్రతిపాదించామని తెలిపారు. వచ్చే ఏడాది పాదయాత్ర చేపట్టి ప్రజల మధ్యకి వెళ్తానని జగన్ ప్రకటించారు. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతారని చెప్పారు. ప్రజల సమస్యలపై తమ పార్టీ గట్టిగా పోరాటం చేస్తోందని, ఆ విషయంలో గర్వంగా ఉందని పేర్కొన్నారు.
Also Read
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
రాజధాని విషయంలో తమ ప్రభుత్వం ఆచరణాత్మక పరిష్కారాన్ని చూపించిందని జగన్ తెలిపారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ప్రతిపాదించామని గుర్తుచేశారు. అంతేకాకుండా ప్లాన్-Bగా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల గ్రోత్ కారిడార్‌గా MAVIGUN ప్రాజెక్టును సూచించామని చెప్పారు. అమరావతిలో ఒక ఎకరాకు కనీస సదుపాయాలకే రూ.2 కోట్లు ఖర్చవుతుందని, మొత్తం ప్రాజెక్టుకు లక్షల కోట్లు అవసరమవుతాయని జగన్ అన్నారు. అదే మొత్తంలో 10% పెట్టుబడితోనే అభివృద్ధి సాధ్యమని, MAVIGUN ద్వారా వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అయితే ఈ ప్రణాళికను తిరస్కరించడం వెనుక అవినీతి ప్రయోజనాలే కారణమని ఆరోపించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు దండుకుంటున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో మహిళల భద్రత దారుణంగా పడిపోయిందని, వివిధ ఘటనల్లో నిందితులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ కాలంలో తీసుకున్న అప్పుల్లో పెద్ద భాగం నేరుగా ప్రజల ఖాతాల్లో డీబీటీ ద్వారా ఇచ్చామని, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయో స్పష్టత లేదని ప్రశ్నించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం వంటి అన్ని రంగాల్లోనూ పరిస్థితి దిగజారిందని జగన్ పేర్కొన్నారు. రైతులకు మద్దతు ధరలు లేవని, ఇన్‌పుట్ సబ్సిడీలు ఇవ్వడం లేదని విమర్శించారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కూడా నిర్వీర్యమయ్యాయని, ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. మొత్తంగా రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని, ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు