Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi We Are Just Getting Back On Track This Is A Better Budget In Current Conditions Cm Chandrababu Naidu

CM Chandrababu: ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నాం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మెరుగైన బడ్జెట్..

Published Date :February 14, 2026 , 4:44 pm
By Sudhakar Ravula
CM Chandrababu: ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నాం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మెరుగైన బడ్జెట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో బడ్జెట్‌-2026-67ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. అయితే, బడ్జెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్‌పై స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం విధ్వంసం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోవాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని, ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ట్రాక్ ఎక్కుతోందని అన్నారు.

Read Also: Maha Shivaratri 2026: రేపే మహాశివరాత్రి.. ఈ తప్పులు చేస్తే పుణ్యం రాదు సరే కదా.. మహా పాపం!

ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉండటం వారసత్వంగా వచ్చిందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిస్థితులను మేనేజ్ చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాల్సిన అవసరం ఉందని, సేవా రంగంలోనూ ఆదాయం పెరగాలని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు… మన రాష్ట్రంలో ఒంగోలు పాలు, అనంతపురం పండ్లకు ప్రత్యేక డిమాండ్ ఉందని, వాటి రుచి మరెక్కడా దొరకదని చెప్పారు. వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామని, అప్పుడు రాష్ట్రం పూర్తిగా గాడిలో పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

అమరావతి అభివృద్ధిపై కూడా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.. వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో అమరావతికి స్పష్టమైన రూపు వస్తుందని తెలిపారు. అమరావతి రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నామని, రాకపోకలు పెరగడంతో ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. పశ్చిమ బైపాస్ నిర్మాణంతో యాక్సెస్ పెరిగిందని, ఇన్నర్ రింగ్, ఔటర్ రింగ్ రోడ్లతో మరింత కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. మొత్తానికి, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సమతుల్యమైన మరియు ముందుచూపుతో రూపొందించిన బడ్జెట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati Development Plans
  • Amaravati ring road project
  • Andhra Pradesh assembly lobby
  • Andhra Pradesh financial recovery
  • AP agriculture and service sector growth

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions