Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పటికే కొన్ని మున్సిపాల్టీల్లో వైసీపీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీలో చేరారు కార్పొరేటర్లు.. దీంతో.. కొన్ని మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకుంది టీడీపీ.. మరోవైపు.. విశాఖపట్నంలో ఈ రోజు వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో.. ఆ ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలకు డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. పార్టీ కండువా కప్పి.. జనసేన పార్టీలోకి ఆహ్వానించారు..
Read Also: UP Video: యూపీలో రెచ్చిపోయిన జంట.. కారులో వెళ్తూ చిల్లర చేష్టలు
ఇక, ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్.. ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలోకి ఇదే తొలి జాయినింగ్‌గా పేర్కొన్న ఆయన.. గత కొంత కాలంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను. ఇప్పుడు పార్టీ కార్యక్రమంలో పాల్గొటుంటే కొత్తగా ఉందన్నారు.. వ్యక్తిగతంగా వైసీపీ మనకు శత్రువు కాదు.. కానీ, వైసీపీ విధానాలతోనే జనసేన విభేధిస్తోందన్నారు.. నాయకుడు తప్పు చేస్తే.. శిక్ష కార్యకర్తలకు పడుతుంది. రాజకీయంగా, అన్ని రకాలుగా జనసేన నేతలు, కార్యకర్తలు ఎదగాలనే నేను కోరుకుంటున్నాను అన్నారు.. జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కూటమి గెలవాలని కోరుకుంటున్నాను అన్నారు పవన్.. విశాఖ కాలుష్య నివారణపై కార్పొరేటర్లుగా మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి అని సూచించారు.. విశాఖలో త్వరలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తాం. త్వరలో విశాఖలో పర్యటిస్తాను. రియల్ ఎస్టేట్ సమస్యలు చాలా ఉన్నాయి. పేదలకు న్యాయం చేసేలా కొర్పొరేటర్లు పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్..