NTV Telugu Site icon

AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్‌.. నామినేటెడ్ పోస్టుల మూడో జాబితా రెడీ..!

Babu

Babu

AP Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు దఫాలుగా నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేసింది.. కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలకు వివిధ నామినేటెడ్‌ పోస్టులు కట్టబెట్టారు.. ఇక, మూడో జాబితాలో మరికొన్ని కీలక పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్‌.. దేవాలయాల పాలక మండళ్లపై కసరత్తు పూర్తి చేశారు.. 222 మార్కెట్ యార్డ్ కమిటీల జాబితా సిద్ధం అవుతోందట.. చైర్మన్ పదవులకు 2 నుంచి 3 పేర్ల ప్రతిపాదనలు రాగా.. ఈ వారంలో పదవుల భర్తీకి సన్నాహాలు సాగుతున్నాయి.. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల పాలక మండళ్లను భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది సర్కార్.. ఇప్పటికే పాలకమండళ్ల నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు పూర్తిస్తాయి నివేదిక వెళ్లగా.. తెలుగుదేశంతో పాటు బీజేపీ, జనసేన పార్టీలిచ్చిన సిఫార్సుల జాబితా కూడా చంద్రబాబు వద్దకు చేరిందని సమాచారం.. ఈసారి మొత్తం 21 ప్రముఖ ఆలయాలకు పాలకమండళ్లను నియమించనున్నారు.. దేవాలయ కమిటీ చైర్మన్ తో పాటు సభ్యులను కూడా నియమించేందుకు రంగం సిద్ధం అవుతోంది..

Read Also: Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లకు చుక్కలే.. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు

మరోవైపు.. వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి కసరత్తు చేస్తున్నారు.. ఏప్రిల్ మొదటి వారంలోగా మార్కెట్ యార్డ్ చైర్మన్ల నియామకాలను చేపట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.. ఇప్పటికే మార్కెట్ కమిటీల నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మొదలు అయ్యింది.. ప్రతి జిల్లా నుంచి నివేదికలు తెప్పించుకుంటోంది అధిష్టానం.. రిజర్వేషన్ల ఆధారంగా పదవులను భర్తీ చేయబోతున్నారు.. ఎస్సీ, ఎన్టీ, బీసీలతో పాటు ఓసీలకు సమ న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట.. జిల్లాల వారీగా రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికలు కూడా సీఎం దగ్గరకు చేరాయట.. మహిళలకు కూడా అగ్రి కల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు డైరెక్టర్ల పదవులు దక్కే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. మొత్తంగా పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్న కొందరు నేతలకు.. ఈ దఫాలు పదవులు దక్కనున్నాయి..