Suryalanka Beach: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్.. సూర్యలంక బీచ్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సూర్యలంక బీచ్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.97 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులు చేపట్టారు. వీటితో పాటు సూర్యలంక ఎక్స్‌పీరియన్స్ జోన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్‌లో నారావారిపల్లె వెళ్తున్న సమయంలో ఈ ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్..
Read Also: Allu Aravind: చిరుపై మెగా ప్రశంసలు కురిపించిన అల్లు అరవింద్..