AP Local Body Elections: ఎన్నికలకు వెళ్లండి.. ఆల్ ది బెస్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో హీట్ పెంచుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.. ఈ ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) దాఖలు చేసిన కేసుపై భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికలు స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం, డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు పటిష్టమైన భద్రత కల్పించాలని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.
నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థులకు అవకాశం
వివిధ కారణాలతో నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం విదితమే కాగా.. అవసరమైన చోట్ల జిల్లా కేంద్రాల్లోనే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏ విధంగా అమలు చేశారో నివేదిక సమర్పించాలని కూడా సూచించింది. ఇక, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం రీ-నోటిఫికేషన్ జారీ చేసింది.. నామినేషన్ల గడువును పొడిగించింది.. ఎక్కడైతే ఫిర్యాదులు అందాయో ఆయా ప్రాంతాల్లో వాటిని పరిశీలించాలని సూచించామని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
Also Read
- Arnab Cyclone Alert: తుఫాన్‌పై హైఅలర్ట్.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు..!
- Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు
- Arnab Cyclone Alert: తుఫాన్ విరుచుకుపడుతుంది.. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వండి.. సీఎం ఆదేశాలు..
- AP Local Body Elections: నామినేషన్ల నుంచి ఏకగ్రీవాల వరకు వివాదాలు.. ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు
ఎన్నికల సంఘం తరఫున తుషార్ మెహతా వాదనలు
రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. నామినేషన్ల గడువును పొడిగించామని, నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని ఆయన ధర్మాసనానికి వివరించారు.. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తీసుకున్న చర్యలను కోర్టు ముందు ఉంచారు. మరోవైపు.. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారించేందుకు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల సమయంలో భద్రతా చర్యలు పటిష్టంగా ఉండాలని, అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా చూడాలని సూచించింది. వాదనలు విన్న అనంతరం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని సూచిస్తూ, “ఆల్ ది బెస్ట్.. ఎన్నికలకు వెళ్లండి” అని పేర్కొంది..
తాజావార్తలు
-
AP Local Body Elections: ఎన్నికలకు వెళ్లండి.. ఆల్ ది బెస్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు
-
Election Commission: 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఈసీ కీలక ఆదేశాలు.!
-
Bombay High Court: ‘‘లీవ్ ఇండియా’’ నోటీసులపై ఇమ్రాన్ ఖాన్‌కు స్వల్ప ఊరట..
-
Zodiac Signs : దీపావళి తర్వాత మారనున్న గ్రహాల గతులు.. ఈ 5 రాశులకు జాక్‌పాట్.!
-
Meerut Blue Drum Case: మీరట్ బ్లూడ్రమ్ కేసులో కీలక పరిణామం.. ఉరిశిక్షపై అప్పీల్ స్వీకరణ.
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!