Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు సవాల్ ఏడ్చినట్లుగా వుంది.. దమ్ము, ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడు..!

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: వైఎస్‌ జగన్ అసెంబ్లీ హాజరుపై సీఎం చంద్రబాబు విసిరిన సవాల్ ఏడ్చినట్లుగా ఉంది అంటూ కౌంటర్‌ ఇచ్చారు వైసీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబుకి దమ్ము, ధైర్యం ఉంటే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఛాలెంజ్‌ చేశారు.. అసలు, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు..? అని ప్రశ్నించారు.. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల పక్షాన గొంతు వినిపిస్తాం… మీ మంద బలంతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారు. అందుకే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.. ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు సమాధానాలు చెప్పటానికి జగన్ ఒక్కరు చాలు అన్నారు.. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడితేనే సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. అయితే, జగన్ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు సమస్యలు చెప్పడానికి వస్తున్నారని తెలిపారు..

Read Also: Pawan Kalyan : చిరంజీవి వద్దన్న మూవీలో నటించిన పవన్.. చివరకు

చంద్రబాబు, లోకేష్ కు అభిమానులు ఉండరు.. ఇక్కడ జగన్ ని కలవడానికి వేల మంది వస్తున్నారు. చంద్రబాబు ముప్పై ఏళ్ల సీఎం అంటే ఎన్టీఆర్ ని ఎలా వెన్నుపోటు పొడిచారనే గుర్తుకు వస్తుంది. చంద్రబాబు వెన్నుపోటుపై సంబరాలు చేసుకోవాలని సలహా ఇచ్చారు సజ్జల.. అత్యధిక మెజార్టీ గెలిచిన ఎన్టీఆర్ ని దింపేశారు. చంద్రబాబు పదవి కోసం కుటుంబ సభ్యులను ఎలా మేనేజ్ చేశారో తెలుసన్నారు.. కోర్టులను చంద్రబాబు మేనేజ్ చేశారని విమర్శించారు.. జగన్ కి ప్రతిపక్ష హోదా ఇస్తామని స్పీకర్ ఒక మాట చెబితే చాలు.. అయినా స్పీకర్ బూతుల్లో ఎక్స్‌పర్ట్.. ఆయన ప్రజా స్వామ్యం గురించి మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు.. అసెంబ్లీకి దమ్ము ఉంటే రా అని చంద్రబాబు ఇప్పుడు ఎందుకు అంటున్నారో అర్ధం కావడం లేదన్న సజ్జల.. రైతులు యూరియా కొరత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. యూరియా కోసం రైతులు వందల మంది చెప్పులు పెట్టి లైన్ లో వుంటున్నారు. కుప్పంలో కూడా రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే వెంట పడి కొడతారని హెచ్చరించారు.. చంద్రబాబు మోసం చేశారని ప్రజలు భావిస్తున్నారు. ఆయనకు ప్రజల దగ్గరకి వెళ్లాలి అంటే భయం ఉంది.. ఇటీవల ఆయన కార్యక్రమాలు కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ తరహాలోనే ఉంటున్నాయని వ్యాఖ్యానించారు సజ్జల రామకృష్ణారెడ్డి..

Exit mobile version