Sajjala Ramakrishna Reddy: అమరావతి బిల్లు పాసయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు సంబరాలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: అమరావతి రాజధాని అంశంపై మరోసారి రాజకీయ వాదోపవాదాలు ముదిరాయి. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి బిల్లు పాసైందని దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టుగా సంబరాలు చేయడం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి పేరుతో ఇతర ప్రాంతాల ప్రజలను కూడా సంబరాల్లో పాల్గొనాలని కోరడం అన్యాయమని అన్నారు. రూ.2 లక్షల కోట్ల భారీ వ్యయంతో నిర్మించాల్సిన ప్రాజెక్టుపై సంబరాలు చేయమని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు. అమరావతి సంబరాల పిలుపును ప్రజలు తిరస్కరించారని, అధికారులూ, ఉద్యోగులూ కూడా స్పందించలేదని పేర్కొన్నారు.
Read Also: US-Iran War: “మేము మీలా క్రూరులం కాదు”.. అమెరికన్ పైలట్ తల్లి బాధపై స్పందించిన ఇరాన్..
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
మూడు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించిందీ టీడీపీనేనని ఆరోపించిన సజ్జల, అమరావతికి కులరంగు పులిమింది కూడా చంద్రబాబేనని విమర్శించారు. అమరావతి అంశంలో అవినీతి జరిగిందని తాము ప్రశ్నిస్తున్నామని, కానీ ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక అంశాలపై కూడా సజ్జల తీవ్రంగా స్పందించారు. తక్కువ వడ్డీకి రుణాలు లభ్యమవుతున్న సమయంలో అధిక వడ్డీకి బాండ్లు తెచ్చుకోవడం ఎలా ఘనతగా చెప్పుకుంటారని ప్రశ్నించారు. ఈ అప్పుల భారాన్ని చివరికి ప్రజలే మోయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
చంద్రబాబు చెప్పే అభివృద్ధి ప్రణాళికలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని సజ్జల అన్నారు. అమరావతి ఎప్పటికి పూర్తి అవుతుందో స్పష్టత లేదని, 2047 వరకు లాగి రాష్ట్ర ఖజానాను దోచుకోవడమే లక్ష్యమని విమర్శించారు. కేవలం కొన్ని భవనాలు కట్టడమే రాజధాని కాదని, ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్న ప్రాంతాల్లోనే రాజధాని అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఇక, మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాలను కలిపే ‘మావిగన్’ ప్రతిపాదనను సమర్థిస్తూ, ఇది ఆచరణాత్మక ఆలోచన అని చెప్పారు. ఈ ప్రతిపాదనకు ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తున్నదని, రాష్ట్రంపై భారంలేని అభివృద్ధి మోడల్‌గా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.
అదేవిధంగా అధికార వికేంద్రీకరణపై కూడా సజ్జల తన అభిప్రాయాలను వెల్లడించారు సజ్జల. దేశంలోని నిపుణులు సూచించిన విధంగా సమగ్ర అధ్యయనం చేసి తీసుకున్న నిర్ణయాలను టీడీపీ తప్పుగా చిత్రీకరిస్తోందని అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ఎగతాళి చేయడం సరికాదని పేర్కొన్నారు. చివరగా, ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. అమరావతి పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి ఆచరణాత్మక నిర్ణయాలే అవసరమని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!